Tollywood : చిరునవ్వుల ఈ చిన్నారి అప్పట్లో స్టార్ హీరోయిన్.. వయసు పెరిగిన తరగని అందం ..
తాజాగా మరో హీరోయిన్ చిన్ననాటి ఫోటో మంత్రముగ్దులను చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ అమ్మాయి 90వ దశకంలో అభిమానులను ఆకట్టుకున్న హీరోయిన్. ఎవరో గుర్తుపట్టగలరా ?... ఈ బ్యూటీ నటించిన ఓ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో యూత్ కలల రాణిగా ఈ అమ్మాడి పేరు మారుమోగింది. ప్రస్తుతం ఆమె వయసు 51.. అయినా 25 ఏళ్ల అమ్మాయిగానే కనిపిస్తూ ఫిట్ నెస్ తో షాకిస్తుంది.

సోషల్ మీడియాలో సినీ తారల చిన్ననాటి ఫోటోస్ ట్రెండ్ అవడం మాములే. కొన్నాళ్లుగా సెలబ్రేటీస్ త్రోబ్యాక్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 90’s హీరోయిన్స్ చిన్ననాటి పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. మొన్నటి వరకు కశ్మీరీ అందాల తారగా కనిపించిన ఓ సీనియర్ హీరోయిన్ బాల్యం ఫోటో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ చిన్ననాటి ఫోటో మంత్రముగ్దులను చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ అమ్మాయి 90వ దశకంలో అభిమానులను ఆకట్టుకున్న హీరోయిన్. ఎవరో గుర్తుపట్టగలరా ?… ఈ బ్యూటీ నటించిన ఓ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో యూత్ కలల రాణిగా ఈ అమ్మాడి పేరు మారుమోగింది. ప్రస్తుతం ఆమె వయసు 51.. అయినా 25 ఏళ్ల అమ్మాయిగానే కనిపిస్తూ ఫిట్ నెస్ తో షాకిస్తుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస ఆఫర్లతో బిజీగా ఉంటుంది. తనే సీనియర్ హీరోయిన్ మధుబాల.
మధుబాల.. హిందీ, తమిళ్, తెలుగు, మలాయళీ భాషలలో దాదాపు 52 సినిమాల్లో నటించింది. ఆమె అసలు పేరు మధు.. కానీ డైరెక్టర్ బాలచందర్ సలహాతో మధుబాలగా మార్చుకుంది. 1990 పోలీస్ అధికారి సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కానీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన రోజా సినిమా ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. 1992లో తెలుగు, తమిళం, మరాఠీ, హిందీలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించింది. ఈ సినిమాలో మధుబాల నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో అల్లరి ప్రియుడు, జెంటిల్ మెన్, పుట్టినిల్లు మెట్టినిల్లు, మిస్టర్ రోమియో, అంతకు ముందు ఆ తర్వాత, సూర్య వర్సెస్ సూర్య చిత్రాల్లో నటించింది.
చాలాకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న మధుబాల ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తెలుగు, తమిళ్ సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. సమంత నటించిన శాకుంతలం సినిమాలో కీలకపాత్రలో కనిపించింది. అలాగే రవితేజ నటించిన ఈగల్ సినిమాలోనూ ముఖ్య పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో మరిన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
