Mamitha Baiju: ‘మమితా బైజు’ రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు.? ‘ప్రేమలు’ ఆకట్టుకున్న మమిత అందం, అభినయం.
గీతాంజలి ఫేమ్ గిరిజ , ఫిదాలో సాయి పల్లవి ఎలా అయితే మ్యాజిక్ క్రియేట్ చేశారో మమితా బైజు అలా చేసింది. ఎంతో చలాకీగా నటించిందని ప్రేమలు సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ రాజమౌళి ఇచ్చిన ప్రశంసతో ఇప్పుడు అందరి దృష్టి మమితపై పడింది. మలయాళంలో విజయవంతమైన ‘ప్రేమలు’ సినిమాని అదే పేరుతో రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేశారు.
గీతాంజలి ఫేమ్ గిరిజ , ఫిదాలో సాయి పల్లవి ఎలా అయితే మ్యాజిక్ క్రియేట్ చేశారో మమితా బైజు అలా చేసింది. ఎంతో చలాకీగా నటించిందని ప్రేమలు సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ రాజమౌళి ఇచ్చిన ప్రశంసతో ఇప్పుడు అందరి దృష్టి మమితపై పడింది. మలయాళంలో విజయవంతమైన ‘ప్రేమలు’ సినిమాని అదే పేరుతో రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేశారు. ముఖ్యంగా మమిత అందం, అభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ రీనూ పాత్రలో ఒదిగిపోయి ఎంతోమందికి అభిమాన నటిగా మారింది. నేరుగా తెలుగులో నటించకపోయినా డబ్బింగ్ చిత్రంతో ఇంతటి క్రేజ్ సొంతం చేసుకోవడం విశేషం. ఎక్స్ లో.. ఆమె గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్ వైరల్ అయ్యాయి. ‘న్యూ క్రష్’, ‘క్యూట్’ అంటూ కామెంట్లు పోటెత్తుతున్నాయి. మమితకు ప్రేమలు 16వ సినిమా. మిగిలిన సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్లు ప్లే చేసింది. మమితా నటించిన తొలి చిత్రం సర్వోపరి పలక్కరన్. ఖోఖో సినిమాలో గేమ్ టీమ్ కెప్టెన్‌గా వైవిధ్యం ప్రదర్శించి, ఉత్తమ సహాయ నటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు అందుకుంది. తెలుగు సినిమాలంటే ఇష్టమని, తాను చూసిన తొలి తెలుగు చిత్రం మగధీర అని మమిత ఓ సందర్భంలో తెలిపింది. ఈగ చిత్రాన్ని ఎన్నోసార్లు చూశానని చెప్పింది. అల్లు అర్జున్ అభిమానినని, ఆయనతో కలిసి నటించే ఛాన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తన మనసులో మాట బయటపెట్టింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

