ఇటీవల సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా తారల ఛైల్డ్ హుడ్ పిక్స్ నెట్టంట బాగా హల్‌చల్ చేస్తున్నాయి. పుట్టిన రోజు అలాగే ప్రత్యేక సందర్భాల్లోనూ త్రో బ్యాక్ అంటూ సినీ తారలు తమ బాల్యం తాలూకూ జ్ఞాపకాల్లోకి వెళుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్.. అనే తేడా లేకుండా సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్క స్టార్స్ తమ అరుదైన ఫొటోస్‌ని షేర్ చేసుకుంటున్నారు. అలా తాజాగా మరో క్రేజీ హీరోయిన్ చిన్న నాటి ఫొటో ఒక్కటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పై ఫొటోను చూశారు కదా.. ఇందులో ఉన్నది ప్రముఖ తెలుగు హీరోయిన్. అయితే తమిళ్, హిందీ, మలయాళ భాషా సినిమాల్లోనూ సత్తాచాటింది. సినిమాలతో పాటు డేటింగ్ వార్తలతోనూ ఈ అమ్మాయి తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఒక తెలుగు హీరోతో ఆమె ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఇద్దరూ దీనిని ఖండించారు. ఈ పాటికే అర్థమై ఉంటుది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. ఆమె మరెవరో కాదు.. ఇటీవల పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో వనితగా మెప్పించిన శోభిత ధూళిపాళ. హిందీతో పాటు సౌత్ సినిమా ఇండస్డ్రీలో వరుసగా సినిమాలు చేస్తోన్న ఈ తెలుగమ్మాయి ఇవాళ (మే 31) పుట్టిన రోజు జరుపుకొంటోంది.
శోభిత హిందీ సినిమాతో తెరంగేట్రం చేసింది. నవాజుద్దీన్ సిద్దిఖీ హీరోగా తెరకెక్కిన రామన్ రాఘవ్ 2.0 చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆతర్వాత అడవి శేష్ గూడఛారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఘోస్ట్ స్టోరీస్ (హిందీ), కురుప్ (మలయాళం), మేజర్, పొన్నియన్ సెల్వన్ సిరీస్ సినిమాలతో సినిమా ప్రేక్షకులకు బాగా చేరువైంది. అయితే నాగచైతన్యతో డేటింగ్ చేస్తుందన్న వార్తలు శోభితను తరచూ వార్తల్లో నిలిచేలా చేశాయి. ఈ ప్రచారాన్ని అటు చైతూ, శోభిత ఇద్దరూ ఖండించారు. ప్రస్తుతం శోభిత చేతిలో సితార అనే హిందీ సినిమాతో పాటు ఒక తమిళ మూవీ ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.