Tollywood: తండ్రితో కలుసున్న చిన్నారి ఎవరో తెలుసా ?.. యాక్సిడెంట్ ఆ హీరోయిన్ జీవితాన్ని మలుపు తిప్పింది..
ఇప్పుడిప్పుడు నెట్టింట తిరిగి యాక్టివ్ అయ్యింది. వరుసగా ఫోటోషూట్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తన కొత్త సినిమా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. పాన్ ఇండియా భారీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసింది. ఇంతకీ పైన ఫోటోలో తన తండ్రితో కలిసి ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ?.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఫేమస్ హీరోయిన్.. డైరెక్టర్ పూరి జగన్నాథ తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ మూవీతో ఆమె పాపులర్ అయ్యింది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా ?..
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుంది. కానీ అందం, అభినయం ఎంత ఉన్నా ఆ ముద్దుగుమ్మకు మాత్రం అదృష్టం కలిసిరావడం లేదు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇక ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమాల్లో కనిపించలేదు. అటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది. అయితే తనకు యాక్సిడెంట్ కావడం వల్లే సినిమాలకు బ్రేక్ ఇచ్చానని.. ఆ తర్వాత కోలుకున్నానంటూ అసలు విషయం చెప్పేసింది. దీంతో ఆమె అభిమానులు కంగారు పడ్డారు. ఇప్పుడిప్పుడు నెట్టింట తిరిగి యాక్టివ్ అయ్యింది. వరుసగా ఫోటోషూట్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తన కొత్త సినిమా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. పాన్ ఇండియా భారీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసింది. ఇంతకీ పైన ఫోటోలో తన తండ్రితో కలిసి ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ?.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఫేమస్ హీరోయిన్.. డైరెక్టర్ పూరి జగన్నాథ తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ మూవీతో ఆమె పాపులర్ అయ్యింది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా ?..తనే హీరోయిన్ నభా నటేష్.
2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ భామ నభా నటేష్. ఆ తర్వాత 2019లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఈ మూవీతో నభా క్రేజ్ మారిపోయింది. కానీ అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాల్లో కనిపించింది. ఆ తర్వాత 2021లో యాక్సిడెంట్ కావడంతో కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇప్పడిప్పుడే తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
తాజాగా ఈ బ్యూటీ క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభు మూవీలో నభా నటేష్ నటిస్తుంది. యాక్సిడెంట్ త్రవాత మళ్లీ సెట్ లోకి అడుగుపెడుతున్నట్లు.. పీరియాడిక్ గెటప్ లోకి మారి ఓ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం నభా నటేష్ న్యూ లుక్ నెట్టింట వైరలవుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.