AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uday Kiran: ఉదయ్ కిరణ్ జోడిగా నటించాల్సిన ‘పెళ్లాం ఊరేళితే’ నటి.. సూపర్ ఛాన్స్ మిస్సయ్యిందే..

ఇటీవల రీరిలీజ్ అయిన ఈ చిత్రానికి మరోసారి బ్రహ్మారథం పట్టారు అడియన్స్. ఇందులో తనికెళ్ల భరణి, శకుంతల, సునీల్, మధునందన్, వైజాగ్ ప్రసాద్, ఆహుతి ప్రసాద్, ఎంఎస్ నారాయణ, బెనర్జీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ మూవీలో ఉదయ్ కిరణ్ సరసన అనిత కథానాయికగా నటించింది. అప్పట్లో వీరిద్దరి జోడిగా తెలుగు ప్రేక్షకులను తెగ నచ్చేసింది. కానీ ఈ సినిమాలో ముందుగా మరో అమ్మాయిని అనుకున్నారట.

Uday Kiran: ఉదయ్ కిరణ్ జోడిగా నటించాల్సిన 'పెళ్లాం ఊరేళితే' నటి.. సూపర్ ఛాన్స్ మిస్సయ్యిందే..
Nuvvu Nenu Movie
Rajitha Chanti
|

Updated on: Apr 04, 2024 | 6:34 PM

Share

దివంగత హీరో ఉదయ్ కిరణ్ కెరీర్‏ను మలుపు తిప్పిన సినిమా నువ్వు నేను. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2001లో విడుదలై అతిపెద్ద విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ ప్రేమకథ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ హిట్ గా నిలిచింది. అలాగే ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని ప్రతిసాంగ్ ఒక్కో ఆణిముత్యం. ఇటీవల రీరిలీజ్ అయిన ఈ చిత్రానికి మరోసారి బ్రహ్మారథం పట్టారు అడియన్స్. ఇందులో తనికెళ్ల భరణి, శకుంతల, సునీల్, మధునందన్, వైజాగ్ ప్రసాద్, ఆహుతి ప్రసాద్, ఎంఎస్ నారాయణ, బెనర్జీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ మూవీలో ఉదయ్ కిరణ్ సరసన అనిత కథానాయికగా నటించింది. అప్పట్లో వీరిద్దరి జోడిగా తెలుగు ప్రేక్షకులను తెగ నచ్చేసింది. కానీ ఈ సినిమాలో ముందుగా మరో అమ్మాయిని అనుకున్నారట. కానీ చివరకు అనితను సెలక్ట్ చేసుకున్నారట. ఇంతకీ నువ్వు నేను సినిమాను మిస్ చేసుకున్న నటి ఎవరో తెలుసా ?.. తనే ఇంద్ర సినిమాలో నటించిన ప్రశాంతి హారతి.

ప్రశాంతి హారతి ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే… కానీ ఇంద్ర సినిమాలో నటించిన ముస్లీం అమ్మాయి లేదా పెళ్లాం ఊరేళితే మూవీలో సునీల్ భార్యగా కనిపించిన నటి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతకు ముందు ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్, రూపాయి వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఇంద్ర సినిమాలో షౌకత్ అలీ ఖాన్ కూతురిగా కనిపించింది. ఆ తర్వాత శ్రీకాంత్, వేణు, సునీల్ నటించిన పెళ్లాం ఊరేళితే సినిమాలో సునీల్ కు అమాయకపు భార్యగా కనిపించి ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రాల కంటే ముందే ఆమె ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను మూవీలో నటించాల్సి ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

నువ్వు నేను సినిమా కోసం డైరెక్టర్ తేజకు ఆడిషన్ ఇచ్చారట. అలాగే ప్రశాంతి హారతికి కథ కూడా వినిపించారట. కానీ ఆ పాత్రకు ఆమె సెట్ కాదని.. ఆమె పూర్తిగా రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా కనిపిస్తుందని.. కానీ ఈ సినిమాలో పాలు అమ్ముకునే వ్యక్తి కూతురిగా కనిపించే అమ్మాయి కావాలని అన్నారట. ఆ తర్వాత కథానాయికగా అనితను తీసుకున్నారని తెలిపింది. దీంతో సూపర్ హిట్ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ మిస్సయింది. పెళ్లి తర్వాత విదేశాల్లో సెటిల్ అయిన ప్రశాంతి హారతి.. ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వచ్చేసింది. ఇప్పుడు అవకాశం వస్తే తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీగా ఉన్నానని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా