Chandramukhi: చంద్రముఖి సినిమాలో వడివేలు భార్య సువర్ణ గుర్తుందా ?.. వయసు పెరిగినా తరగని సోయగం..

అప్పట్లోనే భారీగా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఇందులో రజినీ, వడివేలు మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమాలో వడివేలు భార్య సువర్ణ పాత్రలో నటించి ఫేమస్ అయ్యింది సువర్ణ మాథ్యూ. అందమైన భార్య కావడంతో సువర్ణను ఎవరూ చూడకుండా.. ఆమెతో ఎవరూ మాట్లాడకుండా అనుక్షణం కాపాలాగా ఉండే భర్తగా నటించి నవ్వులు పూయించాడు వడివేలు.

Chandramukhi: చంద్రముఖి సినిమాలో వడివేలు భార్య సువర్ణ గుర్తుందా ?.. వయసు పెరిగినా తరగని సోయగం..
Chandramukhi
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 04, 2024 | 6:06 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో చంద్రముఖి ఒకటి. డైరక్టర్ పీ. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2005లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ మూవీకి సెన్సెషన్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నయనతార, జ్యోతిక, ప్రభు, వినీత్, నాజర్, వడివేలు కీలకపాత్రలు పోషించారు. అప్పట్లో ఈసినిమా మ్యూజిక్ పరంగానూ హిట్ అయ్యింది. అప్పట్లోనే భారీగా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఇందులో రజినీ, వడివేలు మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమాలో వడివేలు భార్య సువర్ణ పాత్రలో నటించి ఫేమస్ అయ్యింది సువర్ణ మాథ్యూ. అందమైన భార్య కావడంతో సువర్ణను ఎవరూ చూడకుండా.. ఆమెతో ఎవరూ మాట్లాడకుండా అనుక్షణం కాపాలాగా ఉండే భర్తగా నటించి నవ్వులు పూయించాడు వడివేలు.

వడివేలు, సువర్ణ, రజినీ కామెడీ ఆ సినిమాకే హైలేట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించిన సువర్ణ… ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యింది. థాయ్ మనసు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన సువర్ణ.. ఆ తర్వాత మయాబజార్, గోకులంలో సీత, పెరియతంబి వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 1990లో ఎక్కువగా తమిళం, మలయాళం భాషలలో అనేక సినిమాలో చేసింది. అలాగే తెలుగులోనూ పలు సినిమాల్లో మెరిసింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సువర్ణ.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తన ఇన్ స్టా ఖాతాలో ఫ్యామిలీ, ఫిల్లల ఫోటోస్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. చంద్రముఖిలో కనిపించిన సువర్ణ.. ఇప్పటికీ అంతే అందంగా కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. సువర్ణ 1992లో మిస్ కేరళ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాతే ఆమె సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2003లో వర్గీస్ జాకబ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి కుమారుడు జాకబ్, కుమార్తె జియా ఉన్నారు. పెళ్లి తర్వాత తన ఫ్యామిలీతో కలిసి అమెరికాలోని ఫిలడెల్ఫియాలో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం సువర్ణ ఇన్ స్టా ఫోటోస్ వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!