Tollywood: యూట్యూబర్ నుంచి టాలీవుడ్ హీరోయిన్‏గా.. ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ..  గుర్తుపట్టండి..

|

Oct 04, 2023 | 4:12 PM

బ్యాక్ టూ బ్యూక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. అటు సోషల్ మీడియాలోనూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. మోడల్ గా ప్రయాణం ఆరంభించి.. ఆ తర్వాత యూట్యూబర్ గా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో అవకాశం అందుకుంది. తొలి సినిమా ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వకపోయినా.. ఈ బ్యూటీకి మాత్రం అవకాశాలు క్యూ కట్టాయి. ఇటీవలే ఓ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వెకెషన్ ఎంజాయ్ చేస్తుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. గుర్తుపట్టారా ?.

Tollywood: యూట్యూబర్ నుంచి టాలీవుడ్ హీరోయిన్‏గా.. ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ..  గుర్తుపట్టండి..
Actress
Follow us on

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఇప్పుడు వరుసగా యువహీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తూ ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టూ బ్యూక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. అటు సోషల్ మీడియాలోనూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. మోడల్ గా ప్రయాణం ఆరంభించి.. ఆ తర్వాత యూట్యూబర్ గా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో అవకాశం అందుకుంది. తొలి సినిమా ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వకపోయినా.. ఈ బ్యూటీకి మాత్రం అవకాశాలు క్యూ కట్టాయి. ఇటీవలే ఓ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వెకెషన్ ఎంజాయ్ చేస్తుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. గుర్తుపట్టారా ?. తనే హీరోయిన్ కేతిక శర్మ.

ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న కేతిక.. బ్లూ డెనిమ్ బ్లాక్ టాప్ తో క్రేజీ స్టిల్ షేర్ చేసింది. ఈ లుక్ లో మరింత ఫాలోయింగ్ పెంచేసుకుంటుంది. తాజాగా కేతిక షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. కేతిక.. మోడల్ కమ్ నటిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోక ముందే యూట్యూబర్ గా ఓ వెలుగు వెలిగింది. పాపులర్ డైలాగ్స్, పాటల రీమిక్స్ వీడియోలతో ఫుల్ పాపులర్ అయ్యింది. 2021లో అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా.. కేతికకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత తెలుగులో లక్ష్య, రంగ రంగ వైభవంగా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాతో మరోసారి అలరించింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో నటిస్తోంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించాల్సి ఉంది. ఇందులో అదితి రావు హైదరీ, అన్సన్ పాల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.