Tollywood: రెండేళ్ల వయసులోనే నటిగా సినిమాల్లోకి వచ్చిన ఈ చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‏గా మారింది.. ఎవరో తెలుసా ?..

ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇంతకీ ఈ చిన్నారిని గుర్తుపట్టారా ?.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, రాజ్ కుమార్ రావ్ చిత్రాల్లో నటించింది బూరె బుగ్గల బుజ్జాయి. అనేక హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. దేశంలోనే అత్యంత ధనిక చిన్నారి. ఇప్పటివరకు రూ. 10 కోట్లు సంపాదించింది. అంతేకాకుండా ఈ బుజ్జాయి ఓ ప్రముఖ నటుడి కూతురు. ఇంతకీ ఈ కుట్టి ఎవరో తెలుసా..

Tollywood: రెండేళ్ల వయసులోనే నటిగా సినిమాల్లోకి వచ్చిన ఈ చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‏గా మారింది.. ఎవరో తెలుసా ?..
Actress

Updated on: Feb 02, 2024 | 9:17 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి రెండేళ్ల వయసులోనే నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. కానీ ఇప్పుడు 17 ఏళ్ల వయసులోనే కథానాయికగా అరంగేట్రం చేస్తుంది. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇంతకీ ఈ చిన్నారిని గుర్తుపట్టారా ?.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, రాజ్ కుమార్ రావ్ చిత్రాల్లో నటించింది బూరె బుగ్గల బుజ్జాయి. అనేక హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. దేశంలోనే అత్యంత ధనిక చిన్నారి. ఇప్పటివరకు రూ. 10 కోట్లు సంపాదించింది. అంతేకాకుండా ఈ బుజ్జాయి ఓ ప్రముఖ నటుడి కూతురు. ఇంతకీ ఈ కుట్టి ఎవరో తెలుసా.. తనే సారా అర్జున్. సారా అర్జున్ రెండు దశాబ్దాలుగా తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకుంది. సారా అర్జున్.. నటుడు రాజ్ అర్జున్ కుమార్తె. అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన బ్లాక్ ఫ్రైడే చిత్రంతో అరంగేట్రం చేసింది.

సారా అర్జున్.. ముంబైలో జన్మించింది. తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించింది. అలాగే అనేక వాణిజ్య ప్రకటనలలో నటించింది. విక్రమ్ చియాన్ నటించిన నాన్న చిత్రంలో నటించింది. 2015లో దాగుడుమూత దండాకోర్ సినిమాలో కనిపించింది. రౌడీ రాథోడ్, రయీస్, సీక్రెట్ సూపర్ స్టార్, డియర్ కామ్రేడ్, తలైవి వంటి చిత్రాల్లో నటించింది. సారా కేవలం ఒకటిన్నర సంవత్సరాల వయస్సులో వినోద పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తన తల్లిదండ్రులతో మాల్‌లో కనిపించిన తర్వాత తన మొదటి వాణిజ్య ప్రకటన చేసింది.

సారా అర్జున్ 2021లో డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కనిపించింది. ఐశ్వర్యరాయ్ టీనేజ్ అమ్మాయి పాత్ర నందినిగా కనిపించింది సారా అర్జున్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ సారా అర్జున్ ను చూసిన అడియన్స్ ఆశ్చర్యపోయారు. 17 ఏళ్ల వయసులోనే రూ. 10 కోట్లు సంపాదించింది. ఇప్పటివరకు భారతదేశంలో అత్యంత ధనిక చైల్డ్ ఆర్టిస్ట్ గా నిలిచింది. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.4 లక్షలు తీసుకుంటుంది సారా . త్వరలోనే ఆమె కథానాయికగా మారే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం విజయ్ దళపతి కొత్త ప్రాజెక్టులో నటిస్తుంది. అలాగే జాకీ ష్రాఫ్ సినిమాలో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.