Tollywood: అకాడమి అవార్డులలో ఉత్తమ నటిగా టాలీవుడ్ హీరోయిన్.. తెగ మురిసిపోతున్న వయ్యారి..

|

Jul 24, 2024 | 10:48 AM

తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్లుగా నెట్టింట సందడి చేస్తూ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా ఉత్తమ నటిగా అకాడమీ అవార్డ్ అందుకుంది. ఆ అవార్డుతో ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చింది. పైన ఫోటోలో అవార్డ్ చేతులో పట్టుకుని తెగ మురిసిపోతున్న ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన నటి..

Tollywood: అకాడమి అవార్డులలో ఉత్తమ నటిగా టాలీవుడ్ హీరోయిన్.. తెగ మురిసిపోతున్న వయ్యారి..
Actress
Follow us on

దక్షిణాది చిత్రపరిశ్రమలో అతి తక్కువ సమయంలోనే ఎన్నో ఆకట్టుకునే పాత్రలతో మెప్పించింది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు.. లేడి ఓరియెంటెడ్ సినిమాలతోపాటు వైవిధ్యమైన పాత్రలు పోషఇంచి ప్రేక్షకుల మనసు దోచుకుంది. తెలుగు, తమిళం, మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్లుగా నెట్టింట సందడి చేస్తూ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా ఉత్తమ నటిగా అకాడమీ అవార్డ్ అందుకుంది. ఆ అవార్డుతో ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చింది. పైన ఫోటోలో అవార్డ్ చేతులో పట్టుకుని తెగ మురిసిపోతున్న ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన నటి.. తనే హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. మలయాళీ నటుడు నివిన్ పౌలీ నటించిన నందల్వార్ నాడ్ నాడు ఓరితవేళ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత మాయానది సినిమాతో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐశ్వర్యలక్ష్మి మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది. సత్యేదేవ్ నటించిన గాడ్సే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత అమ్ము సినిమాతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో ఐశ్వర్య లక్ష్మి నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఈ చిత్రంలో సహజ నటనకు ఉత్తమ నటిగా అకాడమి అవార్డ్ అందుకుంది ఐశ్వర్య. తాజాగా అకాడమి అవార్డుతో ఫోటోలకు ఫోజులిచ్చింది.

అమ్ము చిత్రానికిగానూ ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది ఐశ్వర్య లక్ష్మి. అమ్ములాంటి సినిమాను నమ్మి ఆదరించి తమకు ఇంత గొప్ప అవకాశం, ఎదిగడానికి వేదిక ఇచ్చినందుకు ప్రైమ్ వీడియోకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని పోస్ట్ చేసింది. ఐశ్వర్యతోపాటు ఈ సినిమాలో హీరోగా నటించిన నవీన్ చంద్ కు కూడా ఉత్తమ నటుడిగా అవార్డ్ వచ్చింది. అమ్ము సినిమాకు బెస్ట్ రీజనల్ ఫిల్మ్, బెస్ట్ స్టోరీ అవార్డ్స్ వచ్చాయి. తనతోపాటు తన టీంకు కూడా అవార్డ్స్ రావడం సంతోషంగా ఉందని తెలిపింది. అమ్ము సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ అవార్డ్ వేడుకలలో డీప్ గ్రీన్ ఆఫ్ షోల్డర్ గౌనులో మరింత అందంగా మెరిసిపోయింది ఐశ్వర్య లక్ష్మి. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.