Guess The Actress: ‘ డైరెక్షన్‌ చేస్తా.. ఇది నా కొత్త అవతారం’ అంటోన్న స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

పై ఫొటోను చూశారా? కెమెరా ముందు తన నటనతో అబ్బురపరిచే ఒక స్టార్‌ హీరోయిన్‌ కెమెరా వెనుక నిలబడి చూస్తోంది. మెగా ఫోన్‌ పట్టుకుని నేను కూడా డైరెక్షన్‌ చేస్తానంటూ హింట్ ఇస్తోంది. మరి ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా? ప్రస్తుతం ఈ అందాల తార సౌత్‌ ఇండియన్‌ సెన్సేషన్‌.

Guess The Actress:  డైరెక్షన్‌ చేస్తా.. ఇది నా కొత్త అవతారం అంటోన్న స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?
Tollywood Actress

Updated on: Nov 27, 2023 | 7:30 AM

పురుషులతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో మహిళల ప్రాధాన్యం తక్కువ. హీరోయిన్ల సంగతి పక్కన పెడితే డైరెక్షన్‌ ఇతర విభాగాల్లో పెద్దగా అమ్మాయిలు కనిపించరు. అందుకు బోలెడు కారణాలున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే కొందరు హీరోయిన్లు కూడా మెగా ఫోన్‌ పట్టేందుకు రెడీ అవుతున్నారు. డైరెక్షన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పై ఫొటోను చూశారా? కెమెరా ముందు తన నటనతో అబ్బురపరిచే ఒక స్టార్‌ హీరోయిన్‌ కెమెరా వెనుక నిలబడి చూస్తోంది. మెగా ఫోన్‌ పట్టుకుని నేను కూడా డైరెక్షన్‌ చేస్తానంటూ హింట్ ఇస్తోంది. మరి ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా? ప్రస్తుతం ఈ అందాల తార సౌత్‌ ఇండియన్‌ సెన్సేషన్‌. స్టార్‌ హీరోల సినిమాల్లో గ్లామర్‌ రోల్స్‌ పోషిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెట్‌ మూవీస్‌ లో నటిస్తోంది. ఇటీవలే బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. బ్లాక్ బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. యస్‌.. కెమెరా వెనక నిల్చుకున్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార.

సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌ గా ఉండని నయన తార ఈ మధ్యనే ఇన్‌స్టా గ్రామ్‌లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. తన భర్త, ఇద్దరు పిల్లల ఫొటోలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఫొటోలను అందులో షేర్‌ చేస్తోంది. అలా తాజాగా నయన్‌ పంచుకున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. నయనతార నటిస్తున్నతాజా చిత్రం మన్నాంగట్టి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శర వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ షూట్‌కు సంబంధించిన ఒక ఫొటోను షేర్‌ చేసిందీ అందాల తార. అందులో కెమెరా వెనక నిలబడి పోజులిచ్చింది. దీనికి ‘ ఇది నా కొత్త అవతారం నమ్మండి’ అని క్రేజీ క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో నయన్‌ మెగా ఫోన్‌ పట్టుడానికి రెడీ అవుతుందా? అని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడడుతున్నారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్‌లో నయన్‌ డైరెక్షన్ చేసే అవకాశం ఉందంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇది జస్ట్‌ పబ్లిసిటీ స్టంట్‌ అని మరికొందరు కొట్టి పారేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మన్నాంగట్టి మూవీ సెట్ లో నయన తార..

 భర్త, పిల్లలతో నయన తార..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.