AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? చిరు, పవన్ సినిమాల్లో నటించిన హైదరాబాదీ హీరోయిన్.. కానీ బ్యాడ్‌లక్

పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తున్న పాపను గుర్తు పట్టారా? ఈమె కూడా ఒకప్పుడు తెలుగు నాట ఫేమస్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. పవన్ కల్యాణ్, రామ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అయితే ఆ తర్వాత సరైన ఛాన్సులు రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. కమల్ హాసన్, విశాల్ తదితర హీరోల చిత్రాల్లో నటించింది. అక్కడే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? చిరు, పవన్ సినిమాల్లో నటించిన హైదరాబాదీ హీరోయిన్.. కానీ బ్యాడ్‌లక్
Tollywood Actress Childhood Photo
Basha Shek
|

Updated on: Jul 22, 2024 | 5:27 PM

Share

సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లకు పెద్దగా అవకాశాలుండవు. అందుకే పక్క భాషల సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తుంటారు. తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంటారు. ముఖ్యంగా తమిళ సినిమాలతో బాగా క్రేజ్ తెచ్చుకున్న తెలుగు హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తున్న పాపను గుర్తు పట్టారా? ఈమె కూడా ఒకప్పుడు తెలుగు నాట ఫేమస్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. పవన్ కల్యాణ్, రామ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అయితే ఆ తర్వాత సరైన ఛాన్సులు రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. కమల్ హాసన్, విశాల్ తదితర హీరోల చిత్రాల్లో నటించింది. అక్కడే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుందీ అందాల తార. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు హైదరాబాద్ కు చెందిన మధు శాలిని. ఆదివారం (జులై 21) పుట్టిన రోజు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ అందాల తారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో మధుశాలిని కి సంబంధించిన కొన్ని అరుదైన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శన మిచ్చాయి. పై ఫొటో కూడా అందులోదే.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది మధు శాలిని. మోడలింగ్‌లోనూ అనుభవమున్న ఆమె2005లో మిస్ ఆంధ్రప్రదేశ్ గా ఎంపికైంది. ఆ తర్వాత కొన్ని టీవీషోలకు యాంకర్ గానూ వ్యవహరించింది. ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన అందరి వాడు సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత నా ప్రేమకంటే ఎక్కువ, నాయకుడు, కితకితలు, ఒక విచిత్రం, అజ్ఞాతకుడు, స్టేట్ రౌడీ, జగడం, కింగ్, రాధా గోపాళం, గూఢచారి తదితర తెలుగు సినిమాల్లో నటించింది. అయితే ఇవన్నీ సెకెండ్ హీరోయిన్ పాత్రలే.దీంతో ఈ అమ్మడు తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ విశాల్ నటించిన వాడు వీడు సినిమాతో కోలీవుడ్ ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అలాగే కమల్ హాసన్ చీకటి రాజ్యం సినిమాలోనూ ఒక కీలక పాత్ర పోషించింది. అయితే సినిమాల్లో ఉండగానే 2022లో మలయాళ నటుడు గోకుల్ ఆనంద్‌ని పెళ్లి చేసుకుంది మధుశాలినీ. ఆ తర్వాత నటనను పక్కనపెట్టేసింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుందీ అందాల తార. మధుశాలిని చివరగా ‘9 అవర్స్’ తెలుగు వెబ్ సిరీస్‌లో కనిపించింది.

మధు శాలినీ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?