Pushpa 2: బామ్మలా మజాకా..! అచ్చం శ్రీలీల డ్యాన్స్‌ను దించేశారుగా.. కిస్సిక్కు అంతే

|

Dec 08, 2024 | 6:04 PM

ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది పుష్ప 2 సినిమా. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలు పోషించగా.. శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ కిస్సిక్ నెట్టింటిని ఓ ఊపు ఊపేస్తుంది.

Pushpa 2: బామ్మలా మజాకా..! అచ్చం శ్రీలీల డ్యాన్స్‌ను దించేశారుగా.. కిస్సిక్కు అంతే
Kissik Song
Follow us on

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో దూసుకుపోతుంది పుష్ప 2 సినిమా. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలోనే రికార్డ్ క్రియేట్ చేసింది. డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్, అల్లు అర్జున్ యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ క్రిటిక్స్. ఇందులో అల్లు అర్జున్ మాస్ నట విశ్వరూపం చూపించారని.. ఇక శ్రీవల్లి పాత్రలో రష్మిక సైతం జీవించేసిందని రివ్యూస్ ఇస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల కంటే ముందే సోషల్ మీడియాలో సెన్సెషన్ అయ్యాయి ఈ మూవీ సాంగ్స్. పుష్ప పుష్పరాజ్ నుంచి మొన్న విడుదలైన కిస్సిక్, పీలింగ్స్ పాటలకు నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలోని పాటకు సైతం వరల్డ్ వైడ్ ఫేమ్ వచ్చింది.

ఇక ఈ సినిమాలో శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ కిస్సిక్ నెట్టింట చాలా ఫేమస్ అయ్యింది. ఇక ఈసాంగ్ థియేటర్లలో కుర్రకారును ఓ ఊపు ఊపేస్తుంది. ఈ పాటకు చిన్నా, పెద్ద తేడా లేకుండా నెట్టింట రీల్స్ చేస్తున్నారు. అయితే తాజాగా కిస్సిక్ పాటకు బామ్మలు అదరగొట్టారు. దెబ్బలు పడతాయిరో.. అంటూ స్టెప్పులు వేశారు. కర్ణాటక బెలగాంలో ఉన్న శాంతయి వృద్ధాశ్రమంలో ఉన్న కొందరు బామ్మలు కిస్సిక్ పాటకు స్టెప్పులు వేస్తూ రీల్స్ చేయగా.. ఈ వీడియోను నెట్టింట షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. బామ్మలు వేసిన స్టెప్స్ అదిరిపోయాయంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఈ ఆశ్రమంలోని బామ్మలు, తాతయ్యలు రీల్స్ చేయడం మొదటిసారి కాదు. ఇప్పటికే పలు పాటలకు స్టెప్పులు వేశారు. అలాగే ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. శాంతయి వృద్ధాశ్రమం సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదోకటి పోస్ట్ చేస్తుంటారు. శాంతి సెకండ్ చైల్డ్ హుడ్ అనే పేరుతో ఉన్న ఈ సోషల్ మీడియా ఖాతాకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.