Pakka Commercial: పక్కా కమర్షియల్ పక్కాగా హిట్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ రివ్యూస్ ఇలా ఉన్నాయి

|

Jul 01, 2022 | 10:54 AM

మ్యాచో హీరో గోపీచంద్ తాజాగా పక్క కమర్షియల్(Pakka Commercial)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది.

Pakka Commercial: పక్కా కమర్షియల్ పక్కాగా హిట్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ రివ్యూస్ ఇలా ఉన్నాయి
Pakka Commercial
Follow us on

మ్యాచో హీరో గోపీచంద్ తాజాగా పక్క కమర్షియల్(Pakka Commercial)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యింది. వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతోన్న గోపీచంద్ ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కసిగా ఉన్నారు. ఈ సినిమాలో సత్య రాజ్ కీలక పాత్రలో నటించారు. కామెడీ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో గోపిచంద్ లాయర్ గా కనిపించబోతున్నారు.. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందించారు.

పక్కా కమర్షియల్ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీలో సీరియల్ ఆర్టిస్టుగా కడుపులు చెక్కలయ్యేలా నవ్వించనున్నారు రాశీ. ఈమె కారెక్టర్ ఎంత ఫన్నీగా ఉండబోతుందో ట్రైలర్ లోనే చూపించారు..ఇక ఈ సినిమా పై ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూద్దాం..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి