Pakka Commercial: మ్యాచో హీరో ఆశలన్నీ మారుతి సినిమా పైనే.. పక్కా కమర్షియల్.. పక్కా హిట్ కొట్టేనా..?

|

Dec 04, 2021 | 8:31 AM

ప్ర‌తి రోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్.

Pakka Commercial: మ్యాచో హీరో ఆశలన్నీ మారుతి సినిమా పైనే.. పక్కా కమర్షియల్.. పక్కా హిట్ కొట్టేనా..?
Gopichand
Follow us on

Pakka Commercial: ప్ర‌తి రోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల రాశీ ఖన్నా పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇందులో హీరోయిన్ రాశీ ఖన్నా ఆకాశం నుంచి నేలపైకి వస్తున్న దేవకన్యలా కనిపిస్తున్నారు. ఈమె క్యారెక్టర్‌ను ప్రతిరోజూ పండగే మాదిరే ఇందులోనూ మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు.

గోపీచంద్ పాత్రను కూడా చాలా చక్కగా డిజైన్ చేసారు మారుతి. టీజర్‌లోనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. గత కొంతకాలంగా సైరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. చివరగా వచ్చిన సీటీమార్ సినిమా పర్లేదు అనిపించుకున్న అనుకున్నంత హిట్ టాక్ మాత్రం సొంతం చేసుకోలేదు. దాంతో గోపీచంద్ ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో తనకు సాలిడ్ హిట్ దక్కుతుందని ధీమాగా ఉన్నారు. ఇక భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ – బ‌న్నీవాసు – కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ వస్తుంది. గతంలో జిల్, ఆక్సీజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశి ఖన్నా. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. మార్చ్ 18న సినిమా విడుదల కనుంది. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Arjun: పుష్పరాజ్‏కు స్పెషల్ గిఫ్ట్ పంపిన శ్రీవల్లి.. థ్యాంక్స్ చెప్పిన బన్నీ.. ఏం పంపిందంటే..

Pooja Hegde: రాధేశ్యామ్ కోసం ప్రేరణ డబ్బింగ్ పూర్తిచేసిన పూజా హెగ్డే.. ఫోటో వైరల్..

Fact Check: రామ్ గోపాల్ వర్మ చెప్పిన ఒమిక్రాన్ సినిమా ఉందా? అసలు ఆ పోస్టర్ నిజమైనదేనా?