బెల్లం కొండా సురేష్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే బెల్లం కొండా శ్రీనివాస్ హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఆయన రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ కూడా హీరోగా పరిచయం అయ్యాడు. ఈ కుర్ర హీరో నటించిన స్వాతిముత్యం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సింపుల్ బ్యూటీఫుల్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అందుకున్నారు గణేష్ ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ మూవీతో రానున్నాడు. గణేష్ తన రెండో సినిమా ”నేను స్టూడెంట్ సార్!’ తో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. ఎస్వీ2 ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని ‘నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ”నేను స్టూడెంట్ సర్!’ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఇప్పుడు, మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్లను ప్రారంభించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమా ఫస్ట్ సింగిల్ మాయే మాయే లిరికల్ వీడియోను లాంచ్ చేశారు. క్యాచి ట్యూన్ తో ఆకట్టుకునే మెలోడీ గా ఈ పాటని స్వరపరిచారు మహతి స్వర సాగర్. మహతితో పాటు కపిల్ కపిలన్ ఈ పాటని మ్యాజికల్ గా ఆలపించారు.
కృష్ణ చైతన్య సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథానాయకుడు గణేష్ కి అవంతిక దస్సానిపై ఉన్న ప్రేమను ఈ పాట వర్ణిస్తుంది. శ్రోతలను ఆకట్టుకోవడానికి కావాల్సిన అన్ని అంశాలు మాయే మాయే పాటలో వున్నాయి. మహతి మొదటి పాటతోనే చార్ట్ బస్టర్ నెంబర్ ని అందించారు. గణేష్, అవంతిక ఇద్దరూ తెరపై కూల్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.