AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా కొడుకు బ్రతుకు తెరువు చూపించింది ఆయనే.. స్టార్ డైరెక్టర్ గురించి గోపరాజు రమణ

నటుడు గోపరాజు రమణ తన నట జీవితం, కుటుంబం, ఆధ్యాత్మిక భావాలు, మరియు సినీ రంగంలో తన కుమారుల ఎదుగుదలకు లభించిన తోడ్పాటు గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నాటకరంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రమణ, ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే నాటకాలు, పరిషత్తుల్లో పాల్గొనేవారు.

నా కొడుకు బ్రతుకు తెరువు చూపించింది ఆయనే.. స్టార్ డైరెక్టర్ గురించి గోపరాజు రమణ
Goparaju Ramana
Rajeev Rayala
|

Updated on: Mar 23, 2026 | 1:36 PM

Share

ప్రఖ్యాత నటుడు గోపరాజు రమణ గురించి తెలిసే ఉంటుంది. ఆయన పేరు తెలియకపోయినా.. ఆయనను చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా తండ్రి పాత్రలతో అలరిస్తున్నారు రమణ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన నాటకరంగ ప్రస్థానం, సినిమా ప్రవేశం, అలాగే తన కుమారుల కెరీర్ గురించి వివరించారు. ఆయన యువకుడిగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే నాటకాలు వేస్తూ వచ్చా అని తెలిపారు. 2008లో శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు సంస్థ బాధ్యతలను తన చిన్న కుమారుడు గోపరాజు విజయ్‌కు అప్పగించారట. విజయ్ దర్శకత్వంలో గోపరాజు రమణ నటించి నంది అవార్డు కూడా అందుకున్నారు. విజయ్‌కు నాటకరంగం తప్ప మరొకటి తెలియదని, ఆయన 13 నంది అవార్డులు గెలుచుకున్నారని రమణ గర్వంగా తెలిపారు.

మహేష్ కాకుండా ఇప్పటి హీరోల్లో అతనంటేనే ఇష్టం.. కృష్ణ చెప్పిన పేరు వింటే పూనకాలే

గోపరాజు రమణ సినిమాల్లోకి రావడానికి దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఒక వారధిగా నిలిచారని అన్నారు. గ్రహణం సినిమాతో ఆయనకు అవకాశం ఇచ్చారని. అయితే, తన చిన్న కుమారుడు గోపరాజు విజయ్‌ సినీ కెరీర్‌కు దర్శకుడు అనిల్ రావిపూడి ఎనలేని సహాయం చేశారని రమణ వెల్లడించారు. అనిల్ రావిపూడి, విజయ్‌కు F3 , సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల్లో మంచి పాత్రలు ఇచ్చి, ఆయన ఎదుగుదలకు తోడ్పడ్డారని పేర్కొన్నారు. తనకుమారుడు విజయ్‌కు F3 , సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల్లో అవకాశాలిచ్చి, ఆయన జీవితానికి ఒక మంచి ఊతం ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు.

ఆ సినిమా వల్ల అవకాశాలు చాలా తగ్గాయి.. అలాంటి పాత్రలే చేస్తా అనుకున్నారు: సత్య కృష్ణ

గోపరాజు రమణ కుటుంబం గురించి మాట్లాడుతూ, తన భార్యతో కలిసి ప్రణాళికాబద్ధంగా జీవించామని, వచ్చే ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చుచేసుకున్నామని చెప్పారు. పొదుపు ముఖ్యమని, తాను ఇప్పటికీ దానిని పాటిస్తున్నానని పేర్కొన్నారు. ఆధ్యాత్మికంగా షిరిడి సాయిబాబా, అయ్యప్ప స్వామి భక్తుడైన రమణ, తన శ్రీ సాయి ఆర్ట్స్ సంస్థకు ఆ పేరు రావడానికి కారణం తన భార్యే అని తెలిపారు. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో 1994లో ఈటీవీలో అవకాశం లభించిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో స్టార్ క్రికెటర్ భార్య..? ఇన్నేళ్ల తర్వాత రీ ఎంట్రీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us