AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gasagasala Payasam: గాఢ నిద్ర, ఉక్కులాంటి ఎముకల బలం కోసం.. గసగసాల పాయసం

ఆధునిక జీవనశైలి, నిరంతర పని ఒత్తిడి, స్క్రీన్ టైమ్ ఎక్కువవడం వల్ల నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య 'నిద్రలేమి'. పడుకున్న వెంటనే ప్రశాంతమైన గాఢ నిద్ర పట్టాలన్నా, శరీరానికి అవసరమైన క్యాల్షియం అంది ఎముకలు ఉక్కులా ధృడంగా మారాలన్నా వంటింట్లో ఉండే 'గసగసాలు' సంజీవనిలా మేలు చేస్తాయి. కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో 'గసగసాల పాయసం' అత్యంత విశిష్టమైన సాంప్రదాయ ఆరోగ్య పానీయం.

Phani CH
|

Updated on: Oct 17, 2026 | 8:07 PM

Share
కావలసిన పదార్థాలు: 50 గ్రాముల గసగసాలు, 1 కప్పు బెల్లం తురుము, 1 కప్పు నీళ్లు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు,  5 నుండి 6 బాదం పప్పు, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 టీస్పూన్ కిస్‌మిస్ , 1 టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి.

1 / 5
తయారీ విధానం: కడాయిలో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 5-6 బాదం పప్పులు వేసి నూనె లేకుండా లో ఫ్లేమ్‌పై లైట్‌గా రంగు మారే వరకు వేయించి గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. అదే కడాయిలో 50 గ్రాముల గసగసాలను వేయాలి. మంటను సిమ్‌లో ఉంచి గరిటెతో కలుపుతూ గసగసాలు మంచి గోల్డెన్ రంగులోకి మారేంత వరకు దోరగా వేయించి వేరొక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.

2 / 5
ఒక గిన్నెలో 1 కప్పు బెల్లం తురుము, 1 కప్పు నీళ్లు పోసి మీడియం మంటపై బెల్లం పూర్తిగా కరిగే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. మిక్సీ జార్‌లో మొదట చల్లారిన గసగసాలను మాత్రమే వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ముందే అన్నీ కలిపితే గసగసాలు నలగవు. ఆ తర్వాత వేయించి ఉంచుకున్న జీడిపప్పు, బాదం పప్పులను కూడా వేసి పొడిలా మిక్సీ పట్టాలి.

3 / 5
ఇప్పుడు ఇందులోనే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 5 యాలకులు మరియు కొద్దిగా నీళ్లు పోసి ఎంత వీలైతే అంత మెత్తని నునుపైన పేస్ట్‌లా రుబ్బుకోవాలి. కడాయిలోకి కరిగించిన బెల్లం నీటిని జల్లెడతో వడకట్టుకోవాలి. ఇసుక, నలకలు తొలగిపోతాయి. ఇందులో గ్రైండ్ చేసిన గసగసాల కొబ్బరి పేస్ట్ వేయాలి. జార్‌ను నీళ్లతో కడిగి ఆ నీళ్లను కూడా పోస్తూ పాయసాన్ని చారు మాదిరిగా చాలా పలుచగా కలుపుకోవాలి.

4 / 5
మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో కలుపుతూ పైనున్న నురగ మొత్తం పోయి పాలు పొంగినట్లు రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించాలి. చిన్న పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడిచేసి 1 టీస్పూన్ జీడిపప్పు, 1 టీస్పూన్ ఎండు ద్రాక్ష వేసి ఎర్రగా వేయించాలి. ఈ తాలింపును మరుగుతున్న పాయసంలో వేసి.. పాయసం పైనున్న నెయ్యి జిడ్డు విరిగిపోయేలా మరో రెండు నిమిషాలు మీడియం మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే బలవర్ధకమైన 'గసగసాల పాయసం' సిద్ధం! దీనిని వేడివేడిగా అయినా లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా అయినా తాగితే అద్భుతమైన రుచితో పాటు రాత్రివేళ మనసుకు ప్రశాంతతను ఇచ్చి హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది!

5 / 5
Follow Us
గాఢ నిద్ర, ఉక్కులాంటి ఎముకల బలం కోసం.. గసగసాల పాయసం

ఒంట్లో కొవ్వు పెరిగితే ఈ ఆరోగ్య సమస్యల ముప్పు పెరగొచ్చు!

99 ఏళ్ల వయసులో గాల్లో ఎగిరే విమానంపై నిలబడి సాహసం!ప్రపంచ రికార్డు

10 నిమిషాల్లో కరకరలాడే స్ట్రీట్ స్టైల్ రవ్వ  పునుగులు.. 

నిన్న ఒక పార్టీ లీడర్.. నేడు మరో పార్టీ చైర్మన్ అభ్యర్థి!

పిడికెడు తింటే చాలు.. చచ్చు బడ్డ నరాలు కూడా ఫుల్ యాక్టీవ్..

ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. పెళ్లి తర్వాత ఎంత మారిపోయింది..

గోధుమపిండి టమోటా దోశ: ఇలా వేస్తే టేస్ట్ అదిరిపోతుంది..

రోబోలకు ఇంటిపనులు నేర్పించే ఉద్యోగం... నెల జీతం రూ.90 వేలు! కానీ

కొబ్బరి నూనెలో ఈ ఒక్కటీ కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..