AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ ఆర్థిక వేదికపై భారత్ హవా.. జీడీపీ అంచనాలను పెంచిన వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణంతో సతమతమవుతుంటే.. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ వంటి అగ్రశ్రేణి గ్లోబల్ సంస్థలన్నీ ఏకతాటిపైకి వచ్చి భారత్ జీడీపీ వృద్ధి అంచనాలను వరుసగా రెండేళ్లపాటు 7 శాతానికి పైగా పెంచేశాయి. కొరియా ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ పాలసీ నిపుణుడు క్యుంగ్‌హూన్ కిమ్ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కీలక వివరాలను పోస్ట్ చేశారు.

ప్రపంచ ఆర్థిక వేదికపై భారత్ హవా.. జీడీపీ అంచనాలను పెంచిన వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్
India Gdp Growth
Krishna S
|

Updated on: Oct 17, 2026 | 8:29 PM

Share

కరోనా మహమ్మారి తర్వాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ ఊహించని రీతిలో పుంజుకుంటూ ప్రపంచ వేదికపై సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత్ స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తూ ప్రపంచ దిగ్గజ ఆర్థిక సంస్థలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ప్రపంచ బ్యాంక్ వంటి ప్రముఖ సంస్థలన్నీ భారతదేశ ప్రస్తుత, రాబోయే ఆర్థిక సంవత్సరాల వృద్ధి అంచనాలను ఏకంగా 7 శాతానికి పైగా పెంచుతూ తాజా నివేదికలను విడుదల చేశాయి. ఈ పరిణామంపై కొరియా ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ పాలసీ సౌత్ ఏసియా హెడ్ క్యుంగ్‌హూన్ కిమ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ భారత్ సాధిస్తున్న ఈ అద్భుతమైన వృద్ధి రేటును విశ్లేషించారు.

అంతర్జాతీయ సంస్థల తాజా అంచనాలు ఇవే

క్యుంగ్‌హూన్ కిమ్ పంచుకున్న తాజా గణాంకాల ప్రకారం, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక సంస్థలన్నీ భారత్ వృద్ధిపై గతంలో వేసిన అంచనాలను మరింత పెంచాయి..

వరల్డ్ బ్యాంక్ : గతంలో వేసిన అంచనాలను సవరిస్తూ, 2026-27 సంవత్సరానికి వృద్ధి రేటును 7.1 శాతానికి పెంచింది. అంతేకాకుండా 2027-28 ఆర్థిక సంవత్సరంలోనూ భారత్ 7.2 శాతం స్థాయిలో అత్యధిక వృద్ధిని కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి: గతంలో 6.5 శాతంగా అంచనా వేసిన ఐఎంఎఫ్, తాజాగా 2026-27, 2027-28 రెండు ఆర్థిక సంవత్సరాలకు కూడా భారత్ 7.0 శాతం వృద్ధి రేటును అందుకుంటుందని వెల్లడించింది.

ఆసియా అభివృద్ధి బ్యాంకు: ఏడీబీ సైతం 2026-27 కాలానికి వృద్ధి రేటును 7.0 శాతానికి సవరించగా, 2027-28 ఆర్థిక సంవత్సరంలోనూ భారత్ 7.1 శాతం మేర పటిష్టమైన వృద్ధిని కనబరుస్తుందని అంచనా వేసింది.

గత రికార్డులను తిరగరాస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ

ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన దేశాలు ద్రవ్యోల్బణం, మాంద్యం ముప్పుతో ఇబ్బందులు పడుతున్న సమయంలో భారత్ వరుసగా రెండేళ్లపాటు 7 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు ఏకగ్రీవంగా చెప్పడం దేశ బలమైన ఆర్థిక పునాదులకు నిదర్శనంగా నిలుస్తోంది. దేశీయ వినియోగం పెరగడం, మౌలిక వసతుల రంగంలో భారీ పెట్టుబడులు, తయారీ రంగానికి లభిస్తున్న ప్రోత్సాహకాలు భారత ఆర్థిక ఇంజిన్‌ను వేగంగా ముందుకు నడిపిస్తున్నాయి. భారత్ గతంలో నమోదు చేసిన వృద్ధి రేట్లతో పోల్చి చూసినా, ఈ తాజా ప్రదర్శన అత్యంత విశేషమైనదని ఆర్థిక నిపుణులు ప్రశంసిస్తున్నారు.

Follow Us