AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుర్రాళ్ళ హృదయాలు బద్దలయ్యాయి.. ఆ బ్యూటీకి కూడా పెళ్లి ఫిక్స్ అయ్యిపోయింది

కొంతమంది హీరోయిన్ మరీ గ్లామర్ గా కాకుండా సింపుల్ గా చూడగానే నచ్చేసే విధంగా ఉంటారు. అలాంటి వారిలో మీతా రఘునాథ్. ఇలా అంటే చాలా మందికి తెలియక పోవచ్చు కానీ ఇటీవలే వచ్చిన గుడ్ నైట్ అనే సినిమాలో నటించి మెప్పించింది ఈ చిన్నది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కె. మణికంఠన్, మీతా రఘునాథ్ జోడీగా నటించారు.

కుర్రాళ్ళ హృదయాలు బద్దలయ్యాయి.. ఆ బ్యూటీకి కూడా పెళ్లి ఫిక్స్ అయ్యిపోయింది
Meetha Raghunath
Rajeev Rayala
|

Updated on: Nov 24, 2023 | 5:26 PM

Share

కొంతమంది హీరోయిన్ తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. చూడగానే ఆహా ఇలాంటి అమ్మాయి మనకు లవర్ గా వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. కొంతమంది హీరోయిన్ మరీ గ్లామర్ గా కాకుండా సింపుల్ గా చూడగానే నచ్చేసే విధంగా ఉంటారు. అలాంటి వారిలో మీతా రఘునాథ్. ఇలా అంటే చాలా మందికి తెలియక పోవచ్చు కానీ ఇటీవలే వచ్చిన గుడ్ నైట్ అనే సినిమాలో నటించి మెప్పించింది ఈ చిన్నది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కె. మణికంఠన్, మీతా రఘునాథ్ జోడీగా నటించారు. గురక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ నుంచి తెలుగులోకి డబ్ అయ్యింది. మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎమ్మార్పీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ఈ సినిమా తెరకెక్కింది.

మీతా రఘునాథ్ తమిళ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది. రీసెంట్ గా తమిళ చిత్రం ‘గుడ్ నైట్’లో నటించింది. ఈ సినిమాలో అను అనే పాత్రలో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి నిశ్చితార్థం అయ్యిందని తెలుస్తోంది. మీతా రఘునాథ్ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దాంతో కుర్రకారు గుండెలు బద్ధలవుతున్నయి. ఈ బ్యూటీ కూడా పెళ్లి పీటలెక్కడనుండటంతో ఆమె ఫ్యాన్స్ డీప్ గా హార్ట్ అయ్యారు. మీతా రఘునాథ్ తెలుగులోనూ సినిమా ఛాన్స్ కు అందుకొని హీరోయిన్ గా చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇలా సడన్ గా పెళ్లి అనే షాక్ ఇచ్చింది. దాంతో కుర్రాలంతా విరహ గీతాలు ఆలపిస్తున్నారు.

మీతా రఘునాథ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మీతా రఘునాథ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..