
గాయత్రీ గుప్తా ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి పేరు తెగ వినిపిస్తుంది. చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. ముఖ్యంగా ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ గా నటించింది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే గాయత్రీ గుప్త తాజాగా ఇండస్ట్రీ గురించి. అలాగే క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలోనూ ఈ అమ్మడు క్యాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేసింది. ఆఫర్స్ కోసం కొంతమంది హీరోయిన్స్ కామెంట్మెంట్స్ ఇస్తారు అని చెప్పి షాక్ ఇచ్చింది. అలాగే బేబీ సినిమా కాపీ చేశారని.. అంతకు ముందే తాను హీరోయిన్ గా ఇదే కథతో ఓ సినిమా కూడా మొదలైందని తెలిపింది. తాజాగా బిగ్ బాస్ గేమ్ షో పై షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలోనూ బిగ్ బాస్ ఆడిషన్స్ పై మాట్లాడిన గాయత్రి. తాజాగా మరోసారి ఓ ఇంటర్వ్యూలో ఈ షో గురించి వివాదాస్పద కామెంట్స్ చేసింది.
గతంలో గాయత్రికి బిగ్ బాస్‌లో ఆఫర్ వచ్చిందట.. కానీ విభేదాల కారణంగా ఆమె ఆ షోకు వెళ్లలేదని తెలిపింది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి బిగ్ బాస్ గేమ్ షో పై షాకింగ్ కామెంట్స్ చేసింది గాయత్రి. బిగ్ బాస్ షోకు వెళ్లాలంటే ముందుగా కాంట్రాక్ట్ పైన సంతకం చేయాలి. దాంట్లో చాలా రూల్స్ ఉంటాయి. వాటిలో బిగ్ బాస్ కు ఓకే అయిన తర్వాత సినిమాలు ఒప్పుకోకూడదు.
ఈ కారణంతో తాను దాదాపు 15 సినిమాలను వదులుకున్నాను అని తెలిపింది. అయితే ఏమైందో ఏమో కానీ తనను సడన్ గా బిగ్ బాస్ నుంచి తీసేశారు అని తెలిపింది. దాంతో తనకు నష్టం జరిగిందని.. నష్టపరిహారం కోసం కోర్టుకు కూడా వెళ్ళాను అని తెలిపింది గాయత్రీ. అలాగే ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలని మాత్రం హోటల్స్ కు తీసుకువెళ్తారని తెలిపింది గాయత్రి.. తనకు నాగార్జున పైన అలాగే షో పైన ఎలాంటి వెతిరేకత లేదు అని కేవలం నిర్వాహకుల మీద మాత్రమే తాను పోరాడుతున్నా అని తెలిపింది. తాను బిగ్ బాస్ పై కోర్టుకు వెళ్లడంతోనే రూల్స్ చాలా మారాయి అని.. బిగ్ బాస్ వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం కూడా అందిస్తున్నారు. ఈ విషయం బిగ్ బాస్ లో పాల్గొన్న చాలా మంది తనకు చెప్పారని అని చెప్పుకొచ్చింది గాయత్రీ గుప్త. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..