Game Changer: ఒక్కో కామెంట్.. ఒక్కో డైమండ్..! గేమ్ ఛేంజర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..

|

Jan 08, 2025 | 4:50 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ఈనెల 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఇన్నాళ్లు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్ శంకర్ మొదటి సారి తెలుగులోనూ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే.

Game Changer: ఒక్కో కామెంట్.. ఒక్కో డైమండ్..! గేమ్ ఛేంజర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..
Game Changer
Follow us on

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా మరోకొద్దీ రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 10న గ్రాండ్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఈగర్ గ ఎదురుచూస్తున్నారు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత చరణ్ చేస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. శంకర్ ఈ సినిమాను పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో చాలా మంది నటిస్తున్నారు, సునీల్, అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య నటిస్తున్నారు. అదేవిధంగా రామ్ చరణ్ సరసన బాలీవుడ్ అందాల భామ కియారా అద్వానీ కనిపించనుంది.

ఇది కూడా చదవండి : 8th క్లాస్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తే.. ఎండ్ అయ్యేసరికి ఇంటర్ అయిపొయింది.. ఆర్ఆర్ఆర్ మల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఇప్పటికే ఈ సినిమాకు భారీ ప్రమోషన్ జరిగింది. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతున్న గేమ్ ఛేంజర్ కోసం శంకర్ పక్క ప్లాన్ తో రెడీగా ఉన్నారు. సినిమాలో ఎమోషన్స్, యాక్షన్ సీన్స్, సాంగ్స్, అలాగే సోషల్ మెసేజ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండేలా ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఏ పెద్ద సినిమా రిలీజ్ కు రెడీ అయినా మొదటి రివ్యూ నేనే ఇస్తానంటూ.. ఒక వ్యక్తి వస్తాడు. తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌ని  అని చెప్పుకుంటూ రివ్యూలు ఇస్తుంటాడు. అతనే ఉమైర్ సంధు. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా పై నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : కోయ్.. కోయ్.. కేక పెట్టించిందిరోయ్..! దృశ్యం సినిమాలో వెంకీ చిన్న కూతురు గత్తర లేపిందిగా..!

మరో ఇండియన్ 2 అని, 500కోట్లు లాస్ అని పిచ్చి పిచ్చిగా రివ్యూ ఇచ్చాడు. గేమ్ ఛేంజర్ పేలవమైన సినిమా అని నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. దాంతో ఫ్యాన్స్ కు కాలింది. మనోడిని ఓ రేంజ్ లో ఏసుకుంటున్నారు. ఈ ఫేక్ రివ్యూవర్‌ గతంలో ఇచ్చిన రివ్యూలన్నీ రివర్స్ అయ్యాయి. ప్లాప్ సినిమాలను సూపర్ హిట్స్ అని.. బ్లాక్ బస్టర్ సినిమాలను డిజాస్టర్స్ అని ట్వీట్స్ చేశాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ గురించి ఇలా నెగిటివ్ రివ్యూ ఇవ్వడంతో ఫ్యాన్ మండిపడుతున్నారు. అంతే కాదు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. ఇక ఒక్కో కామెంట్.. ఒక్కో డైమండ్..! మనోడిని బండబూతులు తిడుతున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి