AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Wedding : శ్రీమతి సమంతారాజ్! సామ్ జీవితంలోకి ఓ ‘ఫ్యామిలీ మ్యాన్’

'సమంతరాజ్'.. ఈ రెండు పేర్లు కలవడం వెనక జరిగిన కథంతా ఓ ఇన్‌స్పిరేషనల్ జర్నీ. రియల్లీ...! 'ఇన్‌స్పిరేషన్' అనేంత పెద్ద పదం వాడొచ్చా సమంత విషయంలో. ఎస్.. కచ్చితంగా! జనరల్ పబ్లిక్‌కు తెలియని సమంత 'లైఫ్'.. మరొకటుంది. నేమ్, ఫేమ్, క్రేజ్.. ఇవ్ననీ ఫేజ్ వన్ మాత్రమే. లేదా కాయిన్‌కు వన్ సైడ్ మాత్రమే. కాని, ఆమె తత్వం, జీవితంపై ఆమెకున్న ధృక్పథం గురించి వింటే.. 'వేరే లెవెల్' అనిపిస్తుంది. ఒక చిన్న మాట చెప్పుకుందామా. 'సక్సెస్ అంటే గెలవడం మాత్రమే కాదు.. ఓడినా మళ్లీమళ్లీ ప్రయత్నిస్తుండడం. అవార్డులు, రివార్డులు కాదు సక్సెస్ అంటే. మనకు నచ్చినట్టు జీవించడం. అలా జీవించగలగడమే నిజమైన సక్సెస్. సమంతకు తన లైఫ్ మీదున్న క్లారిటీకి ఈ మాటలే నిదర్శనం. ఆమె చేసిన కామెంట్సే ఇవి. సక్సెస్ విషయంలో సమంత చెప్పింది అక్షర సత్యం. సెలబ్రిటీ అయినా సరే.. 'నచ్చినట్టు బతకడం' అంత ఈజీ కాదీ రోజుల్లో. బట్.. తాను జయించింది. అందరికీ అర్ధమయ్యేలా! అత్యంత అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి 'మయోసైటిస్'ను సైతం గెలిచింది. ఎన్నో విమర్శలను తట్టుకుంది. కచ్చితంగా ఇన్‌స్పిరేషనల్ జర్నీనే. ఇంతకీ.. ఆ జర్నీ ఎలా సాగింది? ఫేస్ చేసిన ఒడిదుడుకులేంటి?

Samantha Wedding : శ్రీమతి సమంతారాజ్! సామ్ జీవితంలోకి ఓ 'ఫ్యామిలీ మ్యాన్'
Samantha Wedding
Ram Naramaneni
|

Updated on: Dec 01, 2025 | 9:42 PM

Share

సమంత పెళ్లిపై దేశమంతా చర్చ జరుగుతోందిప్పుడు. అదే సమయంలో… ‘భూత శుద్ధి’ వివాహం గురించీ మాట్లాడుకుంటున్నారు. ప్రాచీన యోగ సంప్రదాయంలో ఒకటి.. ఈ ‘భూత శుద్ధి’ వివాహ పద్ధతి. ఇంతకీ ఎలా ఉంటుందా పెళ్లి తతంగం..! ఆ పెళ్లి క్రతువుకు ఉన్న ప్రాధాన్యత ఏంటి? దీని గురించే ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. సేమ్‌ టైమ్.. రాజ్ నిడిమోరుతో జీవితాన్ని పంచుకోవాలని ఎందుకనుకుంది సమంత? వాళ్లిద్దరు ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఒక్కటయ్యారు? ఈ విషయంపైనా పెద్ద చర్చే జరుగుతోంది. సాధారణ పెళ్లి తంతులా జరగలేదు సమంత వివాహం. భర్యభర్తల మధ్య అనుబంధాన్ని పెంచే ఓ విశిష్ఠ ప్రక్రియతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది సమంత. రాజ్ నిడిమోరు ఎవరో మరీ విపులంగా చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు డైరెక్టర్స్‌గా ఉన్న ఇద్దరిలో ఒకరే ఈ రాజ్ నిడిమోరు. పాపులర్ ఫిల్మ్ మేకర్. పక్కా తెలుగుబ్బాయి. పుట్టిపెరిగిందంతా తిరుపతిలోనే. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి, సినిమాలపై ఇంట్రస్ట్‌తో అటువైపు ప్రయాణం సాగించారు. తనలాగే ఆలోచించే కృష్ణ దాసరి-డీకేతో కలిసి మొదట షార్ట్ ఫిల్మ్ తీశారు. అది సక్సెస్ అవడంతో ‘ఫ్లేవర్స్’ టైటిల్‌తో ఇంగ్లీష్ మూవీ తీశారు. ఆ తరువాత.. మరింత సక్సెస్ కోసం ఇండియాకొచ్చి ’99’ అనే హిందీ సినిమాను డైరెక్ట్ చేశారు. ‘ఇంకోసారి’ అనే తెలుగు సినిమాకు రైటర్స్‌గానూ పనిచేశారు. ‘షోర్ ఇన్ ద సిటీ’, ‘గో గోవా డాన్’ సినిమాలను తెరకెక్కించారు. ‘డీ ఫర్...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి