SIIMA 2022 : సైమా అవార్డులలో తెలుగు సినిమాల హవా.. బెంగళూరులో మొదలైన వేడుకలు.. ముఖ్య అతిథులుగా బన్నీ..

|

Sep 10, 2022 | 9:12 PM

ఇక ఈ ఏడాది సైమా అవార్డులో వివిధ కేటగీరిల్లో తెలుగు సినిమాలు పోటీ పడ్డాయి. అందులో పుష్ప, అఖండ, ఉప్పెన, జాతిరత్నాలు ఉన్నాయి.

SIIMA 2022 : సైమా అవార్డులలో తెలుగు సినిమాల హవా.. బెంగళూరులో మొదలైన వేడుకలు.. ముఖ్య అతిథులుగా బన్నీ..
Siima Awards
Follow us on

దక్షిణాది భాషల సినిమాలకు సంబంధించి పలు కేటగిరిల్లో అవార్డులు అందిస్తోంది సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సంస్థ (SIIMA 2022 ). ప్రతి సంవత్సరం ఈ వేడుకలను అట్టహసంగా నిర్వహిస్తుంటారు. ఇక ఈ ఏడాది కూడా సైమా అవార్డుల వేడుకలు జరపుతున్నారు. బెంగుళూరులోని గార్డెన్ సిటీలో సైమా 2022 వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలో సినీ పరిశ్రమలో పలు కేటగీరిలకు అవార్డులను ప్రధానం చేయనున్నారు. ఇప్పటికే దక్షిణాదికి చెందిన సినీప్రముఖులు సైమా అవార్డుల ప్రధానోత్సవంకు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇక ఈ ఫంక్షన్ కు మొదటి రోజు కమల్ హాసన్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, యశ్, రణ్వీర్ సింగ్ హాజరుకానున్నారు. ఇప్పటికే బన్నీ, విజయ్, రానా, మంచు లక్ష్మీ ఇతరులు బెంగుళూరుకు చేరుకున్నారు.

ఇక ఈ ఏడాది సైమా అవార్డులో వివిధ కేటగీరిల్లో తెలుగు సినిమాలు పోటీ పడ్డాయి. అందులో పుష్ప, అఖండ, ఉప్పెన, జాతిరత్నాలు ఉన్నాయి. అయితే ఇందులో ఏఏ కేటగీరిల్లో ఎవరెవరు అవార్డులు సొంతం చేసుకున్నారో చూడాల్సిందే. సైమా అవార్డ్స్ 2022 నామినేషన్లలో పుష్ప హావా కొనసాగింది. ఈ చిత్రం ఏకంగా 12 విభాగాల్లో నామినేట్ చేయబడింది. అలాగే బాలకృష్ణ..బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ 10 విభాగాల్లో నామినేట్ కాగా.. ఉప్పెన.. జాతిరత్నాలు 8 విభాగాల్లో నామినేట్ అయ్యాయి. ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్, సుధీర్ బాబు, డింపుల్ హయాతి, ఈషా రెబ్బా, చాందిని చౌదరి, షాలిని పాండే తదితరులు సైమా అవార్డు వేడుకలను విచ్చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.