5న థియేటర్లలో విడుదలైన అల్లు అర్జున్ ‘పుష్ప 2 ది రూల్’ సినిమా దుమ్మురేపుతోంది. పుష్ప మొదటి భాగంలో, అల్లు అర్జున్ పాత్ర పుష్ప కూలీగా జీవితాన్ని ప్రారంభించి, స్మగ్లింగ్ ముఠాకు నాయకుడు అయ్యేంతవరకు ఉంటుంది. ఆతర్వాత ఇప్పుడు పుష్ప 2 లో అసలు కథను చూపించాడు సుకుమార్. పుష్ప: ది రైజ్ అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాజిల్, అజయ్ గోష్, సునీల్ ప్రధాన తారాగణంగా నటించారు. ఈ మూవీ 2021లో విడుదలైన చిత్రం. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మామూలుగా ‘డాన్’, ‘గ్యాంగ్ స్టర్’ సినిమాల్లో కనిపించే కథే అయినా ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన, మ్యానరిజమ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సినిమా ఘన విజయం సాధించింది.
ఇక ఇప్పుడు మొదటి భాగంలో కూలీగా కనిపించిన అల్లు అర్జున్ రెండో భాగంలో పెద్ద స్మగ్లింగ్ కింగ్‌పిన్‌గా కనిపించాడు. సినిమా థియేటర్లలో అదిరిపోయే విజువల్స్ తో ఆకట్టుకుంటుంది. దాదాపు 3 గంటల 25 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా తొలి రోజెక్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పుష్ప 2 సినిమా విడుదలకు ముందే ప్రీ బుకింగ్ లోనే 100 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. అలాగే తొలిరోజు వసూళ్ల విషయానికొస్తే..సినిమా 175 కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం. ఈ నేపథ్యంలో సినిమాలో నటించిన నటీనటుల పారితోషికం ఎంత అనేది ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
పుష్ప చిత్రంలో నటించినందుకు నటుడు అల్లు అర్జున్ 300 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకున్నారు, దర్శకుడు సుముమార్ ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయలు, నటి రష్మిక మంధాన ఈ చిత్రంలో నటించినందుకు 10 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారు. ఈ సినిమాలో నటించినందుకు నటుడు ఫహద్ ఫాజిల్ రూ.8 కోట్ల పారితోషికం అందుకున్నారని, మ్యూజిక్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ రూ.5 కోట్ల పారితోషికం తీసుకున్నారని సమాచారం. అలాగే స్పెషల్ సాంగ్ లో అదరగొట్టిన శ్రీలీల రూ. 2 కోట్లు అందుకుందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.