Shraddha Kapoor: ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? అసలు ఊహించలేరు.. వీడియో

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్నశ్రద్ధా కపూర్ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి సాహో సినిమాలో నటించిందీ అందాల తార. పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో శ్రద్ధా నటించనుందని వార్తలు వచ్చినా అవి రూమర్లు గానే మిగిలిపోయాయి.

Shraddha Kapoor: ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? అసలు ఊహించలేరు.. వీడియో
Shraddha Kapoor
Follow us
Basha Shek

|

Updated on: Dec 06, 2024 | 10:18 PM

సినీ పరిశ్రమలోని ప్రముఖుల గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. సెలబ్రిటీల గురించి తెలుసుకోవడం అభిమానులకు చాలా సంతోషాన్నిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఆధార్ కార్డ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన సినీ అభిమానులు , నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. శ్రద్ధా కపూర్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే సోషల్ మీడియాలో శ్రద్ధా అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ‘టూ జూటీ మే మక్కర్’ సినిమాలో బోల్డ్‌గా కనిపించిన ఆమె హార్రర్ సినిమా ‘స్త్రీ 2’ లో సింపుల్ గాళ్ లుక్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో శ్రద్ధా కపూర్ కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇటీవల జరిగి ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, కొంతమంది శ్రద్ధా కపూర్‌ను ఆమె ‘ఆధార్ కార్డ్’ ఫోటోను బహిర్గతం చేయమని కోరారు. అయితే దీనికి శ్రద్ధా కపూర్ అంగీకరించలేదు. ‘నా ఆధార్ కార్డు ఫోటో ఎవరికీ చూపించలేను’ అని చెప్పేసింది. అనంతరం అందరితో కలిసి సెల్ఫీ దిగిందీ అందాల తార. అయితేఈ సమయంలోనే శ్రద్ధా మొబైల్ కవర్‌పై ఆధార్ కార్డు కనిపించింది. ఇప్పుడు దీనిని చాలా మంది వైరల్ చేస్తున్నారు.

‘స్త్రీ 2’ శ్రద్ధా కపూర్‌కి పెద్ద విజయాన్ని అందించింది. ఈ సినిమా ఏకంగా 600 కోట్ల క్లబ్‌లో చేరి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఆ తర్వాత ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం శ్రద్ధా కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. ‘స్త్రీ 3’ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో శ్రద్ధా కపూర్ కథ కూడా ఉందని అంటున్నారు. ఈ సినిమా ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by S♡. (@shraddha___shruti)

కాగా భారతదేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటీనటులలో శ్రద్ధా కపూర్ ది మొదటి స్థానం. ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో 9.42 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఇండియాలో మరే నటుడికీ, నటికీ ఇంత భారీ ఫాలోయింగ్ లేదు. అన్నట్లు ఈ విషయంలో శ్రద్ధా కపూర్ ప్రధాని నరేంద్ర మోడీని కూడా వెనక్కి నెట్టింది.

శ్రద్దా కపూర్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.