Chaitanya Master: కొరియోగ్రాఫర్ చైతన్య మరణంపై అనుమానాలు.. కొత్త కారణం చెబుతున్న ఫ్రెండ్స్
తాను అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో విడుదల చేశాడు చైతన్య. ఇప్పుడు వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆయన ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో ఆయనతో పని చేసినవారు, పరిచయం ఉన్నవారు ఈ విషయం తెలిసి సోషల్ మీడియా వేదికగా బాధను వ్యక్తం చేస్తున్నారు.
కొరియోగ్రాఫర్ చైతన్య మరణం బుల్లితెరను విషాదం ముంచెత్తింది. చనిపోయే ముందు చైతన్య తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో చైతన్య.. అప్పు ఇచ్చినవాళ్ల నుంచి ఇబ్బంది ఎదురవుతుందని.. తల్లిదండ్రులను, మిత్రుల్ని క్షమాపణలు అడిగి.. ఎంతో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. వీడియోలో చైతన్య చెప్పిన మాటలు అందర్నీ కలచివేస్తున్నాయి. కొన్ని షోలు నేమ్‌తో పాటు ఫేమ్ ఇస్తాయి. కానీ సంపాదన తక్కువగా ఉంటుందన్నాడు. అయినా కష్టపడ్డాం.. నిలబడ్డాం.. అని చెప్పుకుంటూనే ఎమోషనల్ అయ్యాడు.
అయితే ఫ్రెండ్స్ మాత్రం చైతన్య మాటల్ని పూర్తిగా నమ్మడం లేదు. చనిపోయేంత ఆర్థిక సమస్యలు చైతన్యకు లేవంటున్నారు. అదే నిజమైతే తామంతా సాయం చేసేవాళ్లమంటున్నారు. ఓ షోకి సంబంధించి టైటిల్ మిస్ అయిందన్న బాధతోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చంటున్నారు మరికొందరు మిత్రులు. ఆర్థిక సమస్యల్ని ఎప్పుడూ తమతో చెప్పలేదని.. ఎవరి దగ్గర చైతన్య ఏమీ ఆశించేవాడు కాదన్నారు బంధువులు. ఇంతకీ చైతన్య ఎందుకు చనిపోయాడు? సన్మానం జరిగిన మరుసటి రోజు ఎందుకు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు? ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోలేకపోయాడా.. ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నట్టు వేరే కారణాలు ఉన్నాయా? మొత్తానికి చైతన్య మరణం బుల్లితెరను విషాదంలోకి నెట్టివేసింది.
చైతన్య ఆకస్మిక మరణంపై అటు ఢీ షో జడ్జెస్ శేఖర్ మాస్టర్, శ్రద్దా దాస్‌తో పాటు ఇతర డ్యాన్స్ మాస్టర్స్, డ్యాన్సర్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడు ఎప్పుటికి తమ మనసుల్లో నిలిచిపోతాడని కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.