
ఫోక్ సింగర్ నాగవ్వ బాయిలోనే బల్లిపలికే పాటతో ఓవర్‌నైట్‌లో స్టార్‌గా ఎదిగింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలు, ఈ పాట పుట్టుక లాంటి విషయాలను పంచుకుంది. జగిత్యాల జిల్లా ఎనాపల్లి మండలం గుళ్ళకోట గ్రామానికి చెందిన నాగవ్వ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది. పొలం పనుల అలసటను తీర్చుకోవడానికి, తన చుట్టూ ఉన్న ప్రజలను ఉత్సాహపరచడానికి ఫోక్ సాంగ్స్ పాడటం ఆమెకు అలవాటు. బాయిలోనే బల్లిపలికే పాట నాగవ్వ.. తన అమ్మమ్మ ద్వారా వచ్చిన ఒక సంప్రదాయ పాట అని చెప్పుకొచ్చింది. నాగవ్వ తండ్రి బల్లి పలకడం శుభసూచకమని చెప్పేవారట. ఈ నమ్మకమే పాట పుట్టుకకు కారణమైందని ఆమె చెప్పింది. పూర్వకాలంలో దొంగల భయం వల్ల ప్రజలు తమ బంగారాన్ని, వెండిని బావులలో దాచేవారని, బల్లి పలికిన చోట తవ్వకాలు చేయగా ఆ సంపద బయటపడిందని పాట నేపథ్యమని తెలిపింది.
ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో
నాగవ్వ కొడుకు తిరుపతి రెడ్డి.. ఒక లిరిసిస్ట్, దర్శకుడిగా మారాలని అనుకుంటున్నాడట. అతడు ఈ పాటకు కష్టపడ్డాడని నాగవ్వ తెలిపింది. మంగ్లీ, దామోదర్ రెడ్డిల సాయంతో ‘రాక్షస కావ్యం’ సినిమాలో పాట అవకాశంగా మొదలై.. చివరకు బాయిలోనే బల్లిపలికే ఇండివిడ్యువల్ వీడియోగా రూపొందిందని చెప్పింది. ఈ ఒక్క పాట కోసం మూడేళ్లు వేచి చూశామన్నారు. మంగ్లీ, ఆమె బృందం ఈ పాట కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. రూ.15 లక్షలకు పైగా ఖర్చు పెట్టి సుమారు 150 మంది సాంకేతిక నిపుణులతో అత్యంత గ్రాండ్‌గా నిర్మించామని చెప్పింది. కేవలం మూడు రోజులలో షూటింగ్ పూర్తీ చేశామని.. తాము అనుకున్న దానికంటే ఎక్కువగానే పాపులారిటీ ఈ పాటకు వచ్చిందని తెలిపింది. విడుదలైన నెల రోజులకే 70 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.. రోజుకు 1 మిలియన్ వస్తోందని.. పెట్టుబడి దాదాపుగా తిరిగొచ్చేసిందని పేర్కొంది.
ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..