Telugu Indian Idol Winner: 15 వారాలపాటు సాగిన సుదీర్ఘ సంగీత సమరం ముగిసింది. మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ ఎవరు అవుతారా? అనే ఉత్కంఠకు తెర పడింది. సింగర్ వాగ్దేవి మొటి తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ కొట్టేసి.. సరికొత్త చరిత్రను లిఖించింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా వాగ్దేవి మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ ట్రోఫీని అందుకొంది. 15 వారల సుదీర్ఘ సంగీత ప్రయాణం తర్వాత ఆహా ఈ 17న ఫినాలే టెలికాస్ట్ చేసింది. ఈ గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవితో పాటు.. రానా దగ్గుబాటి, సాయిపల్లవి హాజరై ఫైనల్స్‌ని మరింత ఫేవరెట్‌గా మార్చేశారు.
తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ వాగ్దేవికి ట్రోఫీతో పాటు రూ. 10 లక్షల బహుమానం, గీతా ఆర్ట్స్ నుంచి రానున్న సినిమాలో పాడే అవకాశం కూడా లభించింది. ఇక మొదటి రన్నరప్ శ్రీనివాస్‌కు రూ. 3 లక్షలు, రెండో రన్నరప్ వైష్ణవికి రూ. 2 లక్షల బహుమతి లభించింది. సింగర్ వైష్ణవి పాటకు చిరంజీవి మంత్రముగ్ధులయ్యారు. ఆ సమయంలోనే అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. తన తరువాతి సినిమా గాడ్‌ఫాదర్‌లో వైష్ణవికి పాడే అవకాశం ఇచ్చారు.
ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షో తెలుగులో మొట్ట మొదటి సారిగా ఆహా తీసుకురావడం జరిగింది. ఈ షో కి యాంకర్ గా శ్రీరామ చంద్ర నిర్వహించంగా, న్యాయనిర్ణేతలుగా తమన్, నిత్య మీనన్, మరియు కార్తీక్ ఈ షో ని తమ భుజాల మీద వేసుకొని ముందుకు నడిపారు.
షో విన్నర్ వాగ్దేవి మాట్లాడుతూ.. ‘‘ఎంతో సంతోషంగా ఉంది. నేను టైటిల్ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఎంతో మంది దిగ్గజాల ముందు నేను పాడాను. ఈ రోజు చిరంజీవి వంటి పెద్దల చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి నుండి ఎన్నో జ్ఞాపకాలతో పాటు సంగీత జ్ఞానాన్ని కూడా తీసుకొనివెళుతున్నాను. ఇంతటి అవకాశాన్ని కల్పించినందుకు తెలుగు ఇండియన్ ఐడల్, ఆహా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.’’ అని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది.
ఆహా సీఈఓ అజిత్ కె ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘ఆహా ఎప్పుడూ అందరిని అలరించాలని, తెలుగువారి ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి అహర్నిశలు తోడ్పడుతుంది. అలా వచ్చిన ఆలోచనే తెలుగు ఇండియన్ ఐడల్. ఇవ్వాళ ప్రభంజనంలా మారి వాగ్దేవి, వైష్ణవి లాంటి యువ గాయనీ మణులకు ఒక సరికొత్త జీవితానికి నాంది పలికింది. ఇన్ని రోజులు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. టైటిల్ విన్నర్ వాగ్దేవికి, మిగతావారికి అభినందనలు.’’ అని అన్నారు.
ఇక తెలుగు ఐడల్ తొలి టైటిల్ విన్నర్ వాగ్దేవికి చందనాబ్రదర్స్ వారు రూ. 3 లక్షలు, తెనాలిడబుల్‌హార్స్ రూ.3 లక్షలు బహుకరించారు. రన్నరప్ రన్నరప్ శ్రీనివాస్‌కు తెనాలిడబుల్‌హార్స్ రూ.2 లక్షలు బహిుకరించగా.. మరో రన్నరప్ వైష్ణవికి చందనాబ్రదర్స్ రూ. 1 లక్షల బహుమతిగా ఇచ్చారు.