Animal Movie: ‘యానిమల్’తో మరో అర్జున్ రెడ్డిని చూపించేలా ఉన్నాడే.. రణబీర్, రష్మిక రొమాంటిక్ సాంగ్..
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక, రణబీర్ కెమిస్ట్రీ మాత్రం వేరేలెవల్ అని చెప్పొచ్చు. ‘యానిమల్’ సినిమాలో రష్మిక మందన్న, రణబీర్ కపూర్ పాత్రలు చాలా బోల్డ్ గా ఉంటాయనడానికి ఈ పాటే నిదర్శనం. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈ పాటను కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, తమిళంలో విడుదల చేశారు.
పుష్ప ఇచ్చిన క్రేజ్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ అయ్యింది రష్మిక మందన్నా. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసేస్తూ ఫుల్ ఫాంలో ఉంది. సౌత్ టూ నార్త్ అంటూ తెగ ట్రావెల్ చేసేస్తుంది. కానీ హిందీలో రష్మికకు ఇప్పటివరకు సరైన హిట్టు మాత్రం పడలేదు. ఆమె నటించిన గుడ్ బై, మిషన్ మజ్ను చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఆ బ్యూటీ ఆశలన్ని యానిమల్ సినిమాపైనే ఉన్నాయి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక, రణబీర్ కెమిస్ట్రీ మాత్రం వేరేలెవల్ అని చెప్పొచ్చు. ‘యానిమల్’ సినిమాలో రష్మిక మందన్న, రణబీర్ కపూర్ పాత్రలు చాలా బోల్డ్ గా ఉంటాయనడానికి ఈ పాటే నిదర్శనం. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈ పాటను కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, తమిళంలో విడుదల చేశారు. తెలుగులో అమ్మాయి అంటూ సాగే ఈ పాటలో రష్మిక మందన్న, రణబీర్ కపూర్ మధ్య కెమిస్ట్రీని చూసి అభిమానులే ఆశ్చర్యపోయారు. ఈ సినిమాలో డార్క్ లవ్ స్టోరీ ఉంటుందని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు.
ముఖ్యంగా వీరిద్దరి మధ్య లిప్ లాక్ సీన్స్ చూసి మరోసారి అర్జున్ రెడ్డిని చూపిస్తారేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం రొమాంటిక్ లెవల్లో ఈ పాటను రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల రణబీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గతంలో రష్మిక మందన్న హిందీలో ‘గుడ్‌బై’, ‘మిషన్ మజ్ను’ సినిమాల్లో నటించింది. అమితాబ్ బచ్చన్, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి స్టార్ నటులతో నటించిన అనుభవం ఉంది. ఇప్పుడు రణబీర్ కపూర్‌కి జోడీగా ‘యానిమల్’లో నటిస్తోంది. ఈ సినిమా విడుదల తర్వాత రష్మిక క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
View this post on Instagram
డిసెంబర్ 1న ‘యానిమల్’ సినిమా విడుదల కానుంది. ‘అర్జున్‌రెడ్డి’, ‘కబీర్‌సింగ్’ వంటి విజయాల తర్వాత సందీప్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై మంచి క్యూరియాసిటి ఏర్పడింది. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల చేయనున్నారు. ఇటు తెలుగులో పుష్ప 2 చిత్రంలోనూ నటిస్తోంది రష్మిక. అలాగే తెలుగులో మరిన్ని చిత్రాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.