టాలీవుడ్‏లో మరో విషాదం…. కరోనాతో సినీ నిర్మాత మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు..

CN Rao: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. రోజూ రోజూకి పాజిటివ్ కేసులతోపాటు... మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.

  • Rajitha Chanti
  • Publish Date - 3:26 pm, Wed, 21 April 21
టాలీవుడ్‏లో మరో విషాదం.... కరోనాతో సినీ నిర్మాత మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు..
Cn Rao

CN Rao: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. రోజూ రోజూకి పాజిటివ్ కేసులతోపాటు… మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో కరోనా కట్టడికి ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఒక వైపు వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నా.. కోవిడ్ భాదితుల సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ మహామ్మారి మరోసారి సినీ ఇండస్ట్రీపై దాడి చేస్తోంది. ఇప్పటికే పలువురు సినీ నటీనటులు కోవిడ్ భారిన పడగా.. మరికొన్ని సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. అలాగే ఈ మహమ్మారి ప్రభావంతో కొన్ని చిత్రాల విడుదలలు ఆగిపోయాయి. మంగళవారం ప్రముఖ సినీ నిర్మాత CN రావు (చిట్టీ నాగేశ్వరరావు) కోవిడ్ కారణంగా కన్నుమూయడంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. (Corona Virus )

సీఎన్ రావు మరణవార్త తెలిసి పలువురు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. తెలుగులో ”మా సిరిమల్లే, అమ్మ నాన్న లేకుంటే, బ్రహ్మానందం డ్రామా కంపెనీ” అలాగే తమిళ్‌లో ఊరగా అనే సినిమాలు నిర్మించారు CN రావు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శిగా, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడిగా, తెలుగు చలన చిత్ర నిర్మాతల సెక్టార్‌కి సెక్రెటరీగా, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబెర్‌గా, ఎక్స్‌ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబెర్‌గా ఆయన సేవలందించారు. (Covid 19)

Also Read: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‏న్యూస్.. FD సేవల కోసం బ్యాంక్‏కు వెళ్ళాల్సిన పనిలేదు.. సులభంగా ఇంటినుంచే..

మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్‏మెంట్‏కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే.. 

Ayushman Card: ఫ్రీగా ఆయుష్మాన్ కార్డు.. తీసుకున్నవారికి రూ.5 లక్షల బెనిఫిట్.. ఆ తేదీ వరకే ఛాన్స్..

ప్రతి సంవత్సరం రూ.36 వేలు.. కేవలం మహిళలకు మాత్రమే ఛాన్స్… ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా..