Kanal Kannan: పోలీసుల అదుపులో ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్.. కారణం ఏంటంటే
సోషల్ మీడియా గురించి తెలిసిందేగా.. చిన్న విషయమైనా అది క్షణాల్లో ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. దీనివల్ల ఎంత ప్రయోజనం ఉందో తేడా వస్తే అంతే నష్టం కూడా ఉంటుంది. సోషల్ మీడియా కారణంగా పలువురు సెలబ్రెటీలు చిక్కుల్లో పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన షేర్ చేసిన వీడియో కారణంగా ఆయన ఇరుక్కున్నారు. నాగర్ కోయిల్‌కి చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు కనల్ కన్నన్ ను అరెస్ట్ చేశారు. ఓ మతం గురించి ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవ్వడంతో పాటు వివాదానికి కూడా కారణం అయ్యింది. కొద్దిరోజుల క్రితం కనల్ కన్నన్ ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో ఓ మతం వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉండటంతో దేనికి పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా గురించి తెలిసిందేగా.. చిన్న విషయమైనా అది క్షణాల్లో ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. దీనివల్ల ఎంత ప్రయోజనం ఉందో తేడా వస్తే అంతే నష్టం కూడా ఉంటుంది. సోషల్ మీడియా కారణంగా పలువురు సెలబ్రెటీలు చిక్కుల్లో పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు కనల్ కన్నన్ అరెస్ట్ అయ్యాడు.
ఓ పాస్టర్ డాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు ఈ ఫైట్ మాస్టర్. కనల్ కన్నన్ షేర్ చేసిన వీడియోలో ఓ పాస్టర్ యువతితో కలిసి డాన్స్ చేస్తూ కనిపించారు. దాంతో కొందరు ఈ వీడియో పై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వీడియో మనదేశానికి సంబంధించింది కాదు.. అయినప్పటికీ పలువురి మనోభావాలు దెబ్బతిన్నాయి. దాంతో వారు సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే కనల్ కన్నన్ ఇలా అరెస్ట్ అవ్వడం కొత్తేమి కాదు.. గతంలోనూ ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.