
టాలీవుడ్ లో తన నటనతో అందంతో ప్రేక్షకులను కవ్విస్తూ దూసుకుపోతుంది అందాల చిన్నది ఫరియా అబ్దుల్లా..తొలి సినిమాతోనే చిట్టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందాల భామ.. కేవలం వెండితెరపైనే కాకుండా పలు కళా రంగాల్లో తన ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. నటిగా, స్టేజ్ ఆర్టిస్టుగా, పెయింటర్‌గా, సింగర్‌గా, డ్యాన్సర్‌గా అన్ని ట్రై చేయడం వల్ల గందరగోళానికి గురయ్యా అని తెలిపింది. ఫరియా తనకి రచన అంటే అత్యంత ఇష్టమని, తన పాటలకు తానే సాహిత్యం అందిస్తుంటానని వెల్లడించారు. తెలుగు రాయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫరియా పేర్కొన్నారు. చిన్నతనం నుంచే కళల పట్ల తన ఆసక్తిని తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ప్రోత్సహించారని ఫరియా తెలిపింది.
సమ్మర్ క్యాంపులు, చిల్డ్రన్స్ థియేటర్ వర్క్‌షాప్‌ల ద్వారా కొత్త కళలను నేర్చుకునే అవకాశం లభించిందని ఫరియా తెలిపింది. డ్యాన్స్‌తో ప్రారంభమైన తన ప్రయాణం, కంటెంపరరీ, వెస్ట్రన్, హిప్-హాప్ వంటివి నేర్చుకుంటూ కొనసాగిందని. డ్యాన్స్ కేవలం ఒక కళ కాదని, అదొక జీవన విధానమని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత థియేటర్ ప్రపంచంలోకి ప్రవేశించి, సాహిత్యం, ఫైన్ ఆర్ట్స్ వంటివి నేర్చుకున్నాను అని తెలిపింది. ఈ ప్రయాణంలో వివిధ రకాల కళాకారులు, స్క్రీన్‌ప్లే రచయితలు, కవులు, ఫోటోగ్రాఫర్‌లతో కలిసి పనిచేయడం, మోడలింగ్ చేయడం ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నానని ఫరియా వివరించారు.
అలాగే తన ముస్లిం మత నేపథ్యం గురించి మాట్లాడుతూ.. తమ ఇల్లు చాలా సెక్యులర్ అని ఫరియా తెలిపింది. ఆమె తండ్రి సంజయ్ అబ్దుల్లా ఇస్లాం మతం పట్ల ఆకర్షితులై, ఖురాన్‌ను చదివి, హిందూ నేపథ్యం నుంచి ఇస్లాంలోకి మారారు అని తెలిపారు. ఆయన కుటుంబంలో అందరూ తమిళులు, మలయాళీ హిందువులని ఫరియా తెలిపారు. ఇక ఇంట్లో అన్ని పండుగలను జరుపుకుంటూ, అన్ని రకాల ఆచారాలను గౌరవిస్తూ పెరిగానని ఆమె అన్నారు. తన తల్లి, ముస్లిం నేపథ్యం కలిగి ఉన్నప్పటికీ, శివుడిని గురువుగా స్వీకరించారని, రుద్రాక్ష మాలను ధరిస్తూ శివుడికి పూజలు చేస్తారని,ఆమె గొప్ప భక్తురాలిగా మారారని ఫరియా చెప్పుకొచ్చింది. ఇక వ్యక్తిగతంగా, కృష్ణుడు తనకు ఒక గొప్ప రోల్ మోడల్ అని, కష్ట సమయాల్లో ఆయన సహాయం కోసం అడిగితే ఎల్లప్పుడూ సహాయం అందిస్తారని ఫరియా విశ్వసిస్తారు. తమ ఇంట్లో మల్టీ-డైమెన్షనల్ వాతావరణం ఉందని, అయినప్పటికీ తాము ముస్లిం మూలాలను ఎప్పటికీ మరిచిపోలేదని తెలిపింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.