“మళ్లీ పెళ్లికి రెడీ” అంటున్న హీరో

| Edited By:

Jul 27, 2019 | 4:57 PM

మళ్లీ పెళ్లికి రెడీ అవుతున్నడట బాలీవుడ్ డాన్. డైరెక్టర్‌గా కెరియర్ మొదలుపెట్టి హీరోగా సెటిలైన ఫర్హాన్ అక్తర్ తాజాగా మరో పెళ్లికి రెడీ అవుతున్నాడట. ఒక హీరోయిన్‌ని పెళ్లాడాలనుకుంటున్నాడు ఈ జిందగీ నా మిలేగీ దుబారా హీరో . దిల్ చాహతా హైతో డైరెక్టర్‌గా పాపులర్ అయిన ఫర్హాన్ ఆ తర్వాత హీరోగా మారాడు. హీరోగా కూడా భారీ విజయాలు అందుకున్నాడు. చాలా యంగ్ ఏజ్‌లోనే అతనికి పెళ్లయింది. అయితే రెండేళ్ల క్రితం తన భార్యకు విడాకులు […]

మళ్లీ పెళ్లికి రెడీ అంటున్న హీరో
Follow us on

మళ్లీ పెళ్లికి రెడీ అవుతున్నడట బాలీవుడ్ డాన్. డైరెక్టర్‌గా కెరియర్ మొదలుపెట్టి హీరోగా సెటిలైన ఫర్హాన్ అక్తర్ తాజాగా మరో పెళ్లికి రెడీ అవుతున్నాడట. ఒక హీరోయిన్‌ని పెళ్లాడాలనుకుంటున్నాడు ఈ జిందగీ నా మిలేగీ దుబారా హీరో . దిల్ చాహతా హైతో డైరెక్టర్‌గా పాపులర్ అయిన ఫర్హాన్ ఆ తర్వాత హీరోగా మారాడు. హీరోగా కూడా భారీ విజయాలు అందుకున్నాడు. చాలా యంగ్ ఏజ్‌లోనే అతనికి పెళ్లయింది.

అయితే రెండేళ్ల క్రితం తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు ఓ బాలీవుడ్ భామను పెళ్లాడాలనుకుంటున్నాడట. ఆమె పేరు శిబానీ. వీరు పోస్ట్ చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు చూస్తుంటే వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందనిపిస్తోంది. పర్హాన్ అక్తర్ ఇంతకుముందు సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్‌తో డేటింగ్ చేశాడు. ఐతే ఫర్హాన్ అక్తర్‌ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే కాళ్లు విరిచి పోయ్యిలో పెడతానని ఆమె తండ్రి వార్నింగ్ ఇవ్వడంతో వారి లవ్ బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత శిబానీ దండేకర్ అనే యాంకర్ కమ్ హీరోయిన్‌ని ప్రేమించడం మొదలుపెట్టాడు ఈ భాగ్ మిల్కా భాగ్ కథానాయకుడు. త్వరలోనే వీరి పెళ్లి జరగనుందట. అతనికి ఇప్పుడు 44 ఏళ్లు. ఆమెకి పాతికేళ్లు. ఐతే బాలీవుడ్‌లో ఇప్పుడు ఇలాంటి రిలేషన్స్ కామన్‌గా మారాయి.