యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న తారక్. ఆ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో మరోసారి తన నట విశ్వరూపం చూపించారు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా చేశాడు కొరటాల. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ కూడా కాస్త కంగారు పడుతున్నారు.
అయితే కొరటాల మాత్రం ఈసారి సాలిడ్ హిట్ కొట్టి.. గట్టి కామ్ బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. ఈ మేరకు ఓ అదిరిపోయే కథను సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. తారక్ పవర్ఫుల్ డైలాగ్ తో ఈ మోషన్ పోస్టర్ ను డిజైన్ చేశారు. అయితే ఆ తర్వాత ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.
ఈ సినిమాకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న తారక్ అభిమానులు ఇప్పుడు కొరటాల టీమ్ పై కాస్త గరం గరంగా ఉన్నారు. దసరా పండగ సందర్భంగా తారక్ సినిమాకు సంబంధించి ఎదో ఒక అప్డేట్ వస్తుందని అభిమానులంతా ఆశపడ్డారు. అయితే కొరటాల టీమ్ మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మరి ఇప్పటికైన తారక్ ఫ్యాన్స్ కోరిక మేరకు ఎన్టీఆర్ 30 నుంచి ఏదైనా కొత్త అప్డేట్ వస్తుందేమో చూడాలి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.