Beast Movie: బీస్ట్ సినిమా చూసినవారికి బంపర్ ఆఫర్.. లీటర్ పెట్రోల్ ఫ్రీ ఇచ్చిన ఫ్యాన్స్..

ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తమిళ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) నటించిన బీస్ట్ (Beast) సినిమా ఘనంగా విడుదలైంది.

Beast Movie: బీస్ట్ సినిమా చూసినవారికి బంపర్ ఆఫర్.. లీటర్ పెట్రోల్ ఫ్రీ ఇచ్చిన ఫ్యాన్స్..
Vijay
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 13, 2022 | 10:50 AM

ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తమిళ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) నటించిన బీస్ట్ (Beast) సినిమా ఘనంగా విడుదలైంది. ఉదయం నుంచే థియేటర్ల వద్ద విజయ్ ఫ్యాన్స్ హంగామా షూరు చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు బీస్ట్ సినిమా చూసేందుకు థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు. పలు థియేటర్లలో ఉదయం 4 గంటలకే మొదటి షో రిలీజ్ చేశారు. అతి తక్కువ సమయంలోనే బీస్ట్ సినిమా బుకింగ్స్ ఫుల్ అయ్యాయి. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. విజయ్ దళపతి కాంబోలో వచ్చిన ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.. ఇక ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే సినిమాను చూసిన ప్రేక్షకులు ట్వి్ట్టర్ వేదికగా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. తాజాగా చెన్నైలో విజయ్ దళపతి అభిమానులు బీస్ట్ సినిమా చూసిన ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

చెన్నై లో బీస్ట్ సినిమా చూసిన వారికి లీటర్ పెట్రోల్ ఫ్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు విజయ్ దళపతి అభిమానులు. తమిళనాడులో తెల్లవారుజాము నుంచే థియేటర్స్ దగ్గర అభిమానుల సంబరాలు మొదలు పెట్టేశారు. భారీ కటౌట్‏లను ఏర్పాటు చేసి.. బాణాసంచా పేల్చి అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విజయ్ మక్కళ్ ఇయక్కం తరపున బీస్ట్ సినిమా చూడడానికి వచ్చిన వారికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ గా ఇస్తున్నారు అభిమానులు. మరోవైపు విరుద్ నగర్‏లోని రాజ్యలక్ష్మి, అమృతరాజ్ థియేటర్లలో బీస్ట్ ఎఫ్డీఎఫ్ఎస్ సినిమా కోసం టికెట్స్ తీసుకునేవారికి ఇదే తరహా ఆఫర్ ప్రకటించాయి. బీస్ట్ సినిమా కోసం 5 టికెట్స్ కొన్న వారికి లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. విరుద్ నగర్ లో బీస్ట్ సినిమా తొలి షో ఉదయం 7 గంటలకు ప్రదర్శించారు. మరోవైపు.. బీస్ట్ విడుదల సందర్భంగా ఓ ప్రైవేటు సంస్థ తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది.

Also Read: Sanjay Dutt: ఆలియా, రణబీర్ కపూర్ పిల్లల కోసం చూస్తున్నాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన సంజయ్ దత్..

Anil Ravipudi: సరికొత్త లుక్‏లో బాలకృష్ణను చూపించబోతున్నాను.. ఆసక్తికర విషయాలను చెప్పిన డైరెక్టర్ అనిల్ రావిపూడి..

Prashanth Neel : సలార్ సిక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. గట్టిగా చెప్పేస్తానంటూ..

Hair Care Tips: జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా..? ఉసిరితో శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు..