Pooja Hegde: బుట్టబొమ్మ డిమాండ్ మాములుగా లేదుగా.. ఒక్క పాట కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా..

Pooja Hegde: బుట్టబొమ్మ డిమాండ్ మాములుగా లేదుగా.. ఒక్క పాట కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా..
Pooja Hegde

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. అక్కినేని నాగచైతన్య సరసన

Rajitha Chanti

|

Apr 13, 2022 | 10:09 AM

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. అక్కినేని నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు స్పీడ్ మాములుగా లేదు. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇటీవల ప్రభాస్, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబోలో వచ్చిన రాధేశ్యామ్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ అందుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న ఆచార్య సినిమాలోనూ కనిపించనుంది. ఇక తమిళ్ స్టార్ హీరో విజయ్ సరసన బీస్ట్ సినిమాలో నటించింది. ఈ మూవీ ఈరోజు (ఏప్రిల్ 13న) ఘనంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఇలా వరుస ఆఫర్లతో స్పీడ్ పెంచిన బుట్టబొమ్మ.. ఇప్పుడు భారీగా డిమాండ్ చేస్తుందట. ముఖ్యంగా ఒక్కసాంగ్ చేయడానికి కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ అడుగుతోందట పూజా.

డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఎఫ్ 3. ఇందులో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. గతంలో ఈ అమ్మడు రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేల్ రాణి పాటకు అదిరగొట్టింది. ఇక ఇప్పుడు మరోసారి ఎఫ్ 3 సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేసేందుకు పూజా హెగ్డేతో సంప్రదింపులు జరుపుతున్నారట మేకర్స్. అయితే స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డేను కలిసిన మేకర్స్‏కు భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఒకే ఒక్క పాటకు దాదాపు కోటి 25 లక్షల రూపాయాలు డిమాండ్ చేసిందని సమాచారం. అయితే నిర్మాతలు కోటి ఇస్తామని పూజాను కన్వీన్స్ చేసి ఒప్పించారని టాక్ వినిపిస్తోంది. ఈ పాటకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే జరగనుందని సమాచారం. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను మే 27న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

Also Read: Sanjay Dutt: ఆలియా, రణబీర్ కపూర్ పిల్లల కోసం చూస్తున్నాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన సంజయ్ దత్..

Anil Ravipudi: సరికొత్త లుక్‏లో బాలకృష్ణను చూపించబోతున్నాను.. ఆసక్తికర విషయాలను చెప్పిన డైరెక్టర్ అనిల్ రావిపూడి..

Prashanth Neel : సలార్ సిక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. గట్టిగా చెప్పేస్తానంటూ..

Hair Care Tips: జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా..? ఉసిరితో శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu