Adipurush: ఇది రెబల్ స్టార్ రేంజ్.. ఆదిపురుష్ దెబ్బకు సైట్ క్రాష్ అయ్యింది..
మహోన్నత మనిషిగా.. దేవుని రూపంగా అందరి మదిలో ముద్రైపోయింది. హైఎండ్ అడ్వాన్స్‌డ్ గ్రాఫిక్స్‌లో.. మనకు తెలిసిన రామాయణ అరణ్య కాండ ఎలా ఉండబోతోందో.. చూడాలనే క్యూరియాసిటీ అందర్లో అంతకంతకూ పెరిగిపోతోంది.

ఆదిపురుష్ మూవీ ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. త్రూ అవుట్ ఇండియా.. జై శ్రీరామ్ నామమే మరామ్రోగుతోంది. ఆ రఘురాముడిగా.. ప్రభాస్ రూపమే అందరికీ కనిపిస్తోంది. మహోన్నత మనిషిగా.. దేవుని రూపంగా అందరి మదిలో ముద్రైపోయింది. హైఎండ్ అడ్వాన్స్‌డ్ గ్రాఫిక్స్‌లో.. మనకు తెలిసిన రామాయణ అరణ్య కాండ ఎలా ఉండబోతోందో.. చూడాలనే క్యూరియాసిటీ అందర్లో అంతకంతకూ పెరిగిపోతోంది. జూన్ 16 డేట్ వైపే చూసేలా చేస్తోంది. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, ట్రైలర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. బుక్ మై షో లో ఆదిపురుష్ మూవీ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. కాగా నిన్న రాత్రి నుంచి ప్రభాస్ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే ఒక్కసారిగా ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు పెద్ద ఎత్తున టికెట్స్ బుకింగ్ కోసం ఆసక్తి చూపారు. దాంతో సైట్ క్రాష్ అయ్యింది.
అర్ధరాత్రి ఒక్కసారిగా బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే అభిమానులు టికెట్స్ కోసం ఎగబడ్డారు. దాంతో తెల్లవారు జామున 4 గంటల వరకు సైట్ క్రాష్ అయ్యింది. 4 గంటల నుంచి బుకింగ్స్ మొదలయ్యాయి. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ సినిమా భారీ వసూళ్లను సాధించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇంతలా అంచనాలు పెరిగిపోయిన ఈ మూవీని.. పేద పిల్లలకు.. అనాథ పిల్లలకు ఉచితంగా చూపించాలని కొందరు సెలబ్రిటీలు ముందుకు వచ్చారు. రణబీర్ కపూర్, అనన్య బిర్లా, అభిషేక్ అగర్వాల్, మంచు మనోజ్ ఇలా పలువురు ఆదిపురుష్ టికెట్స్ యూ అనాథ పిల్లలకు పంచనున్నారు.
