K.G.F: Chapter 2 : ఫ్లిప్ ఆర్ట్‌తో ఆకట్టుకున్న చిన్నారి ఫ్యాన్.. ఏకంగా కేజీఎఫ్2 టీజర్‌నే దింపేసాడు..
కేజీఎఫ్ మూవీ ఫస్ట్ పార్ట్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన మొదటి..
K.G.F: Chapter 2 : కేజీఎఫ్ మూవీ ఫస్ట్ పార్ట్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన మొదటి పాన్-ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీగా గుర్తింపు లభించింది. రాకింగ్ స్టార్ హీరో యశ్ ఈ సినిమాతో అన్ని ఇండస్ట్రీలో అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక కేజీఎఫ్ 2 సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న పాన్ ఇండియన్ సినిమా ఇదే. అన్ని ఇండస్ట్రీలలో అదిరిపోయే బిజినెస్ చేస్తుంది కేజీఎఫ్ 2. ఇటీవల ఈ సినిమానుంచి టీజర్ రిలీజ్ అయ్యి సంచలను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఒక చిన్నారి అభిమాని ఈ టీజర్‌ను ఫ్లిప్‌ఆర్ట్ రూపంలో 100 భాగాలుగా చేసి ఆశ్చర్యపరిచాడు. వీటిని సూర్య ఫ్యాన్స్ తరఫున హీరో యష్‌ను ట్యాగ్ చేస్తూ కొందరు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై ‘కేజీఎఫ్ ’ చిత్ర నిర్మాత కార్తీక్‌గౌడ అద్భతంగా ఉందంటూ మెచ్చుకున్నారు. ఇక కేజీఎఫ్ 2 జులై 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
Flip art with 100 drawings #KGF2 #KGF @TheNameIsYash hope you like it.. from suriya fans @prashanth_neel #yash pic.twitter.com/hzoUEXn1uE
— AK arts (@mirshad_aakif) February 12, 2021