Pawan Kalyan: ఇలాంటి అభిమానులు నీకే సొంతం సామీ.! అక్షరాలతో పవన్ కళ్యాణ్ అద్భుత చిత్రం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. చిన్న గ్యాప్ దొరికినా కూడా షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం హరిహరవీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా హిస్టారికల్ కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అలాగే ఓజీ షూట్ లోనూ జాయిన్ అవుతున్నారు పవన్

Pawan Kalyan: ఇలాంటి అభిమానులు నీకే సొంతం సామీ.! అక్షరాలతో పవన్ కళ్యాణ్ అద్భుత చిత్రం
Pawan Kalyan Photo

Updated on: Jun 27, 2025 | 6:57 PM

నంద్యాల జిల్లా నందికొట్కూరు లో నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో అక్షరాలతో పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు కళాకారుడు దేశెట్టి శ్రీనివాస్…. 2019 ఎన్నికల సమయంలో తన ఇంటి పేరు గల కొణిదెల గ్రామాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ గ్రామంలో నెలకొన్న పరిస్థితులను చూసి ఎన్నికలలో గెలిస్తే కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని గ్రామస్తులకు మాట ఇచ్చారు…. కానీ 2019 ఎన్నికలలో జనసేన పార్టీ ఓడిపోవడం జరిగింది.

ఇది కూడా చదవండి :హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల గ్రామ అభివృద్ధికి 50 లక్షల సొంత నిధులు గ్రామ అభివృద్ధికి మంజూరు చేయడం జరిగింది… కొణిదెల గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను తీర్చేందుకు వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది… కొణిదెల గ్రామానికి 50 లక్షల నిధులతో మంచినీటి సౌకర్యం కల్పించిన సందర్భంగా నందికొట్కూరు కు చెందిన ప్రముఖ చిత్రకారుడు శెట్టి శ్రీనివాసులు అక్షరాలతో పవన్ కళ్యాణ్ చిత్రపటం గీసి కృతజ్ఞతలు తెలిపారు… ఈ అక్షరాలలో గొప్ప మనసున్న మహారాజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆదర్శ నేత కొణిదెల పవన్ కళ్యాణ్ అని కొనియాడుతూ చిత్రపటాన్ని గీసి తన అభిమానాన్ని చాటుకున్నారు.

ఇది కూడా చదవండి :ఈ అమ్మడు సోషల్ మీడియా బ్యూటీ కదా మావ.! ఎవరో గుర్తుపట్టారా..?

పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం హరహరవీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమా చేస్తున్నాడు. వీటితోపాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : కుబేర సినిమాలో అమ్మ పాట పాడింది ఈవిడే.. ఆమె గొంతులోనే ఎదో మాయ ఉంది..

Pawan Kalyan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి