Darshan: దర్శన్ తరఫున వాదించనున్న ప్రముఖ లాయర్ సీవీ నగేశ్.. గతంలో ఏయే కేసులు హ్యాండిల్ చేశారంటే?

|

Jun 21, 2024 | 12:59 PM

అభిమాని రేణుకా స్వామి హత్యలో నిందితులుగా ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ ను కాపాడేందుకు అతని కుటుంబ సభ్యులు శత విధాలా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా హీరో సతీమణి విజయ లక్ష్మి ప్రముఖ లాయర్లను రంగంలోకి దింపుతోంది. దర్శన్ తరపున న్యాయవాదులు అనిల్ బాబు , రంగనాథ రెడ్డి ఇప్పటికే మెజిస్ట్రేట్ కోర్టులో వాదిస్తున్నారు

Darshan: దర్శన్ తరఫున వాదించనున్న ప్రముఖ లాయర్ సీవీ నగేశ్.. గతంలో ఏయే కేసులు హ్యాండిల్ చేశారంటే?
CV Nagesh, Actor Darshan
Follow us on

అభిమాని రేణుకా స్వామి హత్యలో నిందితులుగా ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ ను కాపాడేందుకు అతని కుటుంబ సభ్యులు శత విధాలా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా హీరో సతీమణి విజయ లక్ష్మి ప్రముఖ లాయర్లను రంగంలోకి దింపుతోంది. దర్శన్ తరపున న్యాయవాదులు అనిల్ బాబు , రంగనాథ రెడ్డి ఇప్పటికే మెజిస్ట్రేట్ కోర్టులో వాదిస్తున్నారు . ఇప్పుడు ఈ కేసులో దర్శన్ తరపున వాదించేందుకు అనుభవజ్ఞుడైన సీనియర్ న్యాయవాదిని రంగంలోకి దింపారు. వారంరోజుల క్రితం మహిళలపై అత్యాచారం, కిడ్నాప్ ఆరోపణల కేసులో జైలుకెళ్లి బెయిల్ పొందిన హెచ్ డీ రేవణ్ణ తరపున వాదించిన సీవీ నగేష్ ఇప్పుడు దర్శన్ తరఫున వాదించనున్నారు. కాగా విజయలక్ష్మి దర్శన్, అతని తల్లిదండ్రుల తరపున అనిల్ బాబు, రంగనాథ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. ఇప్పుడు అనిల్ బాబు, రంగనాథ రెడ్డిలకు బదులు సివి నగేష్ వాదిస్తారా లేక అనిల్ బాబు, రంగనాథ రెడ్డిలతో పాటు సీవీ నగేష్ కూడా వాదిస్తారా అనేది చూడాలి. ఒక నిందితుడి తరపున ఇద్దరు న్యాయవాదులు వాదించే అవకాశం కూడా ఉంది. లేదా మేజిస్ట్రేట్ కోర్టులో అనిల్ బాబు, రంగనాథ రెడ్డి వాదనలు వినిపిస్తే దర్శన్ తరఫున సీవీ నగేష్ హైకోర్టులో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

సీవీ నగేష్‌కి సహాయ న్యాయవాదిగా ఉన్న రాఘవేంద్ర ఇప్పటికే అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నటుడు దర్శన్‌ను కలిశారు. బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, దర్శన్‌ నుంచి అవసరమైన సమాచారాన్ని రాబట్టామని ఆయన చెప్పారు. మిగిలిన రిమాండ్ షీట్‌ను పోలీసుల నుంచి రాబట్టామని, జూన్ 22న సీవీ నగేష్ తన వాదనను వినిపించనున్నారని పేర్కొన్నారు.

కాగా మహిళలపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో హెచ్‌డి రేవణ్ణ జైలులో ఉన్నప్పుడు ఆయన తరపున వాదించి కొద్దిరోజుల్లోనే బెయిల్ వచ్చేలా చేయడంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది సీవీ నగేష్ కీలక పాత్ర పోషించారు. భవానీ రేవణ్ణ జైలుకు వెళ్లకుండా చేయడంలో నగేష్ పాత్ర కూడా ఉందని అంటున్నారు. అంతకు ముందు దాడి కేసులో జైలుకెళ్లిన మహ్మద్ నలపాడ్ తరపున కూడా నగేష్ స్వయంగా వాదించారు. మరి ఇప్పుడు దర్శన్ కేసులో ఏం జరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.