OTT Movie: మెడిసిన్స్‌తో తండ్రినే లేపేసే ఘనుడు..సైకో కిల్లర్‌గా పుష్ప విలన్ అరాచకం.. ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

ఫహాద్‌ ఫాజిల్‌.. సోలో హీరోగానే కాకుండా విలన్ గానూ, సహాయక నటుడిగానూ మెప్పిస్తున్నాడీ మలయాళం స్టార్ యాక్టర్. అలాంటి ఫహాద్‌ ఫాజిల్‌ ఈ మూవీలో ఒక సైకో కిల్లర్ గా అద్భుతంగా నటించాడు. ఎంతలా అంటే మెడిసిన్స్ తో తండ్రినే హత్య చేసేలా..

OTT Movie: మెడిసిన్స్‌తో తండ్రినే లేపేసే ఘనుడు..సైకో కిల్లర్‌గా పుష్ప విలన్ అరాచకం.. ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
OTT Movie

Updated on: Aug 26, 2025 | 9:52 PM

పుష్ప, పుష్ప 2 సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు కూడా చేరువైపోయాడు మలయాళం నటుడు ఫహాద్‌ ఫాజిల్‌క. సోలో హీరోగానే కాకుండా విలన్, సహాయక నటుడి పాత్రలతో అలరిస్తోన్న ఈ నటునికి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు ఉంది. పుష్ప కంటే ముందు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు ఫహాద్. అందులూ ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఒకటి. కేరళలోని రబ్బర్ ప్లాంటేషన్‌లో జరిగే ఈ క్రైమ్ స్టోరీలో ఫహాద్ నటన నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. అందుకే స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు ఈ మూవీకి వచ్చింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళలోని ఎరుమెలీలో రబ్బర్ ప్లాంటేషన్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇక్కడ కుట్టప్పన్ అనే ఒక ధన వంతుడు ఉంటాడు. అతని ముగ్గురు కుమారులు. అందులో ఫహాద్‌ ఫాజిల్‌ కూడా ఒకడు. ఇంజనీరింగ్ డ్రాప్‌అవుట్ కావడంతో సొంత తండ్రి చేతిలోనే లూజర్ గా అవమానాలు ఎదుర్కొంటాడు. ఇదే సమయంలో కరోనా లాక్ డౌన్ లో కుట్టప్పన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చేరతాడు. ఫహాద్‌ ఫాజిల్‌ తో సహా ముగ్గురు కుమారులు తండ్రిని వదిలించుకునేందుకు ఇదే మంచి అవకాశమనుకుంటారు.

 

కుట్టప్పన్ రికవరీ అవుతుండగా ఫహాద్ తన సోదరులతో కలిసి తండ్రి మందులు మార్చి చనిపోయేలా చేస్తాడు. అయితే ఈ హత్య తర్వాత ఫహాద్ జీవతమే మారిపోయింది. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని నేరాలు చేస్తాడు. చివరకు ఒక సైకో కిల్లర్ లా మారిపోతాడు. మరి ఫహాద్ అరాచకాలు బయటపడ్డాయ? చివరికి అతను ఏమయ్యాడు? అన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఊహించని క్లైమాక్స్ తో ముగిసే ఈ సినిమా పేరు జోజి.  IMDb లో 7.8/10 రేటింగ్ ఉంది. దిలీష్ పోతన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ (జోజి), బాబురాజ్ (జోమోన్), ఉన్నిమాయ ప్రసాద్ (బిన్సీ) తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. సుమారు 1 గంట 53 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు కానీ ఒరిజినల్ వెర్షన్ కు ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫహాద్ ఫాజిల్ నటన,  మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూడాలనుకునే వారికి జోజి ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.