
కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఎంతో కష్టపడి ఎదిగాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.తన డాన్స్ తో ఇండస్ట్రీనే ఊపేశాడు. స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేసి స్టెప్పులేయించాడు. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన లారెన్స్.. ఆ తర్వాత హీరోగా అలరించాడు. తెలుగు, తమిళం భాషలలో అనేక సినిమాల్లో నటించాడు. ఇండస్ట్రీలో సన్సేషన్ క్రియేట్ చేసిన డాన్స్ మూమెంట్స్ లారెన్స్ ఖాతాలోవే.. అలాగే రీసెంట్ గా నటుడిగా జిగర్తాండ డబుల్ ఎక్స్, చంద్రముఖి, రుద్రన్ సినిమాలతో అలరించాడు.
ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న లారెన్స్, మరోవైపు సామాజిక సేవలోనూ ముందుంటారు. ఇప్పటికే ఎంతో మందికి తనవంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. చిన్నారులకు, పేదలకు ఎంతో సాయం చేశాడు లారెన్స్. అలాగే తన ఫౌండేషన్ ద్వారా కష్టాల్లో ఉన్న పేదలకు, విద్యార్థులకు సాయం చేశారు. అలాగే తాజాగా మరోసారి గొప్పమనసు చాటుకున్నాడు లారెన్స్. తాజాగా లారెన్స్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఏముందంటే..
ముగ్గురు చిన్నారులు తమ తల్లికి ఆరోగ్యం బాలేదని దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి వీడియో చూసి చలించిపోయాడు లారెన్స్. ఈ వీడియో నా వరకు షేర్ చేసిన వారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ప్రభుత్వాన్ని సాయం కోరినందుకు వాళ్ళు త్వరలోనే స్పందించి మిమ్మల్ని ఖచ్చితంగా ఆదుకుంటారు. మీకు సహాయం చేయడానికి నేను నా వంతు కృషి చేస్తాను.. నా బృందం ఈరోజే మిమ్మల్ని కలుసుకుంటుంది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు లారెన్స్.. ఈ పోస్ట్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కలియుగ కర్ణుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.