AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్య షూటింగ్ మధ్యలో ఆపేసి ఎక్కడో తేడా కొడుతోందన్నారు.. వాళ్లకు నేను చెప్పింది ఇదే.!

ప్రముఖ సినీ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, తొలిప్రేమ లాంటి చిత్రాల నిర్మాణ అనుభవాలను పంచుకున్నారు. దిల్‌ రాజుతో అనుబంధం, ఎడిటింగ్ రూమ్‌లో చర్చల ప్రాధాన్యత, ప్రతి సినిమాకు నోట్స్ రాసుకునే పద్ధతిని వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆర్య షూటింగ్ మధ్యలో ఆపేసి ఎక్కడో తేడా కొడుతోందన్నారు.. వాళ్లకు నేను చెప్పింది ఇదే.!
Arya Movie
Ravi Kiran
|

Updated on: May 11, 2026 | 8:50 AM

Share

తెలుగు సినీ పరిశ్రమలో ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ అంటే ఒక నమ్మకం. ఎడిటింగ్ టేబుల్ మీద సినిమా జాతకాన్ని మార్చేయగల సత్తా ఆయన సొంతం. దిల్ రాజు, సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాతలతో దశాబ్దాల అనుబంధం ఉన్న ఆయన, తాజాగా ఎడిటింగ్ రూమ్‌లో జరిగే చర్చలు, క్లాసిక్ సినిమాల వెనుక ఉన్న ఆసక్తికర పరిణామాలను పంచుకున్నారు. ‘ఆర్య’ నుంచి ‘బొమ్మరిల్లు’ వరకు ఆయన ప్రయాణంలో మనకు తెలియని ఎన్నో విషయాలను ఆయన బయటపెట్టారు.

దిల్ రాజు నిర్మించిన ‘ఆర్య’ సినిమా నేడు ఒక కల్ట్ క్లాసిక్. కానీ, మొదటి షెడ్యూల్ తర్వాత ఈ సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చిందని వెంకటేష్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆ హీరో క్యారెక్టరైజేషన్ అందరికీ కొత్తగా, కాస్త వింతగా అనిపించింది. అయితే, ఎడిటింగ్ రూమ్‌లో ఫుటేజీ చూసిన వెంకటేష్.. “ఇది కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది, ధైర్యంగా ముందుకు వెళ్లండి” అని దిల్ రాజుకు నమ్మకాన్ని ఇచ్చారట. బన్నీ వాసు, దిల్ రాజు లాంటివారు ఎడిటింగ్ రూమ్‌లో ఇచ్చే స్వేచ్ఛ వల్లే అద్భుతమైన అవుట్‌పుట్ వస్తుందని ఆయన కొనియాడారు.

దర్శకుడు బోయపాటి శ్రీను తొలి చిత్రం ‘భద్ర’ సమయంలో జరిగిన ఒక చర్చను ఆయన వివరించారు. ఎడిటర్ అంటే కేవలం సీన్లు కట్ చేయడం కాదు, సినిమా వేగాన్ని సెట్ చేయడం. భద్ర క్లైమాక్స్‌లో హీరో విలన్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్ ఒకటి ఉండేది. అయితే, అది క్లైమాక్స్‌లో ఉన్న వేగాన్ని తగ్గిస్తుందని భావించిన వెంకటేష్, ఆ సీన్‌ను తొలగించాలని సూచించారు. సరైన లాజిక్ చెబితే దర్శకులు కూడా అర్థం చేసుకుంటారని, ఆ మార్పు వల్లే క్లైమాక్స్ అంత పవర్‌ఫుల్‌గా వచ్చిందని ఆయన తెలిపారు.

ఇక ‘బొమ్మరిల్లు’ సినిమాలో తండ్రిని ప్రశ్నించే సీన్ అందరికీ గుర్తుంది. కానీ వెంకటేష్ దృష్టిలో సినిమాను బ్లాక్ బస్టర్ చేసింది మాత్రం జెనీలియా చెప్పే ఒకే ఒక్క డైలాగ్. “నేను ఈ ఇంట్లో ఉండలేను” అని ఆమె చెప్పే సన్నివేశం చూసినప్పుడే ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తుందని ఆయనకు అర్థమైందట. దిల్ రాజు ప్రతి సినిమాను ప్రాణం పెట్టి చేస్తారని, సక్సెస్ వచ్చినప్పుడు ఆయన ఒక చిన్న పిల్లాడిలా ఆనందిస్తారని వెంకటేష్ గుర్తు చేసుకున్నారు. కాగా, ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న AI టెక్నాలజీపై వెంకటేష్ తనదైన శైలిలో స్పందించారు. టెక్నాలజీ మారినా సృజనాత్మకతకు ప్రత్యామ్నాయం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. AI కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. అది మనుషుల ఎమోషన్లను అర్థం చేసుకోలేదు. ఎక్కడ క్లోజ్ షాట్ ఉండాలి, ఎక్కడ వైడ్ షాట్ ఉండాలి అనేది ఎడిటర్ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. అది మిషన్లు చెప్పలేవు అని అన్నారు.

Follow Us
రెండు నెలల్లో ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం..!
రెండు నెలల్లో ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం..!
ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. పోలింగ్, ఫలితాల తేదీ ఇదిగో
ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. పోలింగ్, ఫలితాల తేదీ ఇదిగో
ఆ సినిమాలో కథ ఉందా అని అడిగా..
ఆ సినిమాలో కథ ఉందా అని అడిగా..
ఇలా చేస్తే చూస్తూ ఉండిపోకండి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు
ఇలా చేస్తే చూస్తూ ఉండిపోకండి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే