Dulquer Salmaan: ఆరేళ్లకు ఓటీటీలోకి వచ్చిన దుల్కర్ సల్మాన్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

ఓటీటీలోకి ఈమధ్యకాలంలో కొత్త కొత్త చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కేవలం నెలరోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలవుతున్నాయి. కానీ ఈరోజు ఓటీటీలోకి వచ్చిన ఓ సినిమా దాదాపు ఆరేళ్ల క్రితమే థియేటర్లలో సందడి చేసేంది. ఇంతకీ ఏ సినిమానో తెలుసా.. ?

Dulquer Salmaan: ఆరేళ్లకు ఓటీటీలోకి వచ్చిన దుల్కర్ సల్మాన్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
Oka Yamudi Premakatha

Edited By: TV9 Telugu

Updated on: Jun 05, 2025 | 3:42 PM

మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి చెప్పక్కర్లేదు. మమ్ముట్టి తనయుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ హీరో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళంలోనే కాకుండా తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగు వారి హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. హీరోయిజం చిత్రాలు కాకుండా విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అయితే దుల్కర్ సల్మాన్ ఆరేళ్ల కింద నటించిన ఓ సూపర్ హిట్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

2019లో దుల్కర్ సల్మాన్ నటించిన రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ఒరు యమండన్ ప్రేమకథ. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. అయితే థియేటర్లలో కాదండి.. కేవలం ఓటీటీలో మాత్రమే తెలుగు వెర్షన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఒక యముడి ప్రేమకథ పేరుతో విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా జూన్ 5న స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో విడుదలైన ఆరేళ్లకు తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు.

ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన సంయుక్త మీనన్ నటించింది. విరూపాక్ష, సార్ వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సరైన ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభు చిత్రంలో నటిస్తుంది. ఇందులో నిఖిల విమల్, బిబిన్ జార్జ్, శివకామ అనంత నారాయణ్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తెలుగుతోపాటు మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..