Dulquer Salmaan: డైలమాలో దుల్కర్ సల్మాన్- వైజంతి మూవీస్ సినిమా.. ఉన్నట్టా..? లేనట్టా..?
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. మణిరత్నం తెరకెక్కించిన ఓకే బంగారం సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Dulquer Salmaan: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. మణిరత్నం తెరకెక్కించిన ఓకే బంగారం సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓకే బంగారం సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని చేసుకుంది. ఆ తర్వాత దుల్కర్ నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అయ్యాయి. ఇక నాగ్ అశ్విన్ నటించిన మహానటి సినిమాలో దుల్కర్ నటన ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించింది. జెమని గణేష్ పాత్రలో అద్భుతంగా నటించారు దుల్కర్ సల్మాన్. ఇటీవల విడుదలైన `కనులు కనులను దోచాయటే` సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. మహానటి సినిమా తర్వాత వైజయంతి బ్యానర్ లోనే దుల్కర్ తో మహానటి నిర్మాతలు వేరొక సినిమా ప్లాన్ చేశారు. అందాల రాక్షసి ఫేం హనురాఘవపూడి దర్శకత్వం ఉండబోతుందని ఆమధ్య వార్తలు వచ్చాయి.
దాంతో దుల్కర్ సల్మాన్ తెలుగులో డైరెక్ట్ సినిమా చేయబోతున్నాడని ఆమధ్య వార్తలు తెగ హడావిడి చేశాయి. హనురాఘవాపుడి కూడా దుల్కర్ కోసం ఓ ఇంట్రస్టింగ్ స్ట్రోరీని కూడా రెడీ చేసారని అన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా గురించి ఎక్కడ చడీచప్పుడు లేదు. అసలు ఈ సినిమా ఎక్కడివరకు వచ్చింది. అసలు మొదలైందా.. అసలు అవుతుందా..? అన్నది ఎవ్వరికి తెలియడం లేదు. నాగ్ అశ్విన్ ప్రభాస్ తో సినిమా ప్రారంభించడంతో దుల్కర్ సినిమా సైడ్ అయిపోయిందనే టాక్ మరోవైపు వినిపిస్తోంది. అయితే అది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :