Dulquer Salmaan: ‘నిద్రలేని రాత్రులు గడుపుతున్నా’.. దుల్కర్‌ ఎమోషనల్‌ వీడియో.. ఆందోళనలో ఫ్యాన్స్‌

|

Jul 04, 2023 | 3:04 PM

దుల్కర్‌ సల్మాన్‌..పేరుకు మలయాళ నటుడైనా ఈ స్టార్‌ హీరోకు తెలుగులోనూ బోలెడు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ హ్యాండ్సమ్‌ హీరోకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. మొదట మలయాళ డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు దుల్కర్‌.

Dulquer Salmaan: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. దుల్కర్‌ ఎమోషనల్‌ వీడియో.. ఆందోళనలో ఫ్యాన్స్‌
Dulquer Salmaan
Follow us on

దుల్కర్‌ సల్మాన్‌..పేరుకు మలయాళ నటుడైనా ఈ స్టార్‌ హీరోకు తెలుగులోనూ బోలెడు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ హ్యాండ్సమ్‌ హీరోకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. మొదట మలయాళ డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు దుల్కర్‌. ఆ తర్వాత మహానటి, సీతారామం వంటి డైరెక్ట్‌ తెలుగు సినిమాలతో ఇక్కడివారికి మరింత చేరువయ్యాడు. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు దుల్కర్‌. తన లేటెస్ట్‌ ఫొటోస్‌, వీడియోలతో పాటు సినిమా అప్డేట్స్‌ను అందులో షేర్‌ చేస్తుంటారు. ఈక్రమంలో అతను షేర్‌ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ‘గత కొన్ని రోజులుగా నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను’ అంటూ దుల్కర్‌ షేర్‌ చేసిన ఇన్‌స్టా వీడియో అభిమానులను తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. ‘ఏమైంది సార్‌’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించడంతో వెంటనే వీడియోను డిలీట్‌ చేశారు దుల్కర్‌. అయితే అప్పటికే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

ఇవి కూడా చదవండి

ఆ వీడియోలో కళ్లు తడుముకుంటూ కనిపించిన దుల్కర్‌.. ‘ కొద్ది సేపు నాకు నిద్రపట్టలేదు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. జీవితంలో మొదటిసారి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. నా మైండ్‌లో నుంచి దాన్నిచెరపలేకపోతున్నాను. అందరికీ దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. కానీ మాటలు రావడం లేదు. అలాగే నేను చెప్పొచ్చో లేదో తెలియదు’ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు దుల్కర్. వీడియో ఒక్కసారిగా వైరల్‌ కావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ‘సార్‌.. మీకు ఏమైంది’, ‘ఎందుకలా మాట్లాడుతున్నారు’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. అయితే వీటికి సమాధానం చెప్పని దుల్కర్‌ వెంటనే తన ఇన్‌స్టా వీడియోను డిలీట్‌ చేశారు. అయితే అప్పటికే చాలామంది ఆ వీడియోను డౌన్‌లోడ్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. అయితే ఇప్పటివరకు తన వీడియోపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు దుల్కర్‌. దీంతో అతని అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.