Dude Movie: డ్యూడ్ మూవీలోని ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే మతిపోవాల్సిందే
వరుసగా మూడో చిత్రంతోనూ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు ప్రదీప్ రంగనాథన్. 'డ్యూడ్' మూవీ రిలీజ్ అయిన రోజు నుంచి హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్ళతో రన్ అవుతోంది. ఇక ఇందులో ఓ స్మాల్ రోల్ లో కనిపించిన హీరోయిన్ గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.

లవ్‌టుడే, డ్రాగన్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత హీరో ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన ‘డ్యూడ్’.. ఈ దీపావళికి విడుదలై తమిళ, తెలుగు భాషల్లో అద్భుత విజయాన్ని అందుకుంది. తొలి ఆట నుంచి హిట్ టాక్ సాధించి.. మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం ఇప్పటికే రూ. 100 కోట్లు వసూలు సాధించిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయ్. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘ప్రేమలు’ ఫేం మమితా బైజు కథానాయికగా నటించగా.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్‌లో అలరించి ఓ హీరోయిన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ఫోటోలు ప్రస్తుతమ ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాయి.
ఆ వైరల్ హీరోయిన్ ఎవరు.?
డ్యూడ్‌లో మమితా బైజు, నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఇక ఓ స్మాల్ రోల్‌లో కనిపించి అభిమానులను అలరించింది ఐశ్వర్య శర్మ. ఆమె జమ్మూ కాశ్మీర్‌కు చెందిన మోడల్, నటి. డ్యూడ్‌లో ఆమె క్లైమాక్స్ సీన్ నటన అందరినీ అలరించింది. ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి ముఖ్యమైన సన్నివేశాల్లో కనిపించిన ఈ హీరోయిన్ గురించి.. ప్రస్తుతం నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వెతుకుతున్నారు. ఆమె ఐడీ కోసం సెర్చ్ చేస్తున్నారు.
తెలుగులో ఇప్పటికే హీరోయిన్‌గా..
ఐశ్వర్య శర్మ తమిళ ఇండస్ట్రీలోకి ‘డ్యూడ్’ మూవీతో అరంగేట్రం చేసినప్పటికీ.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. డ్యూడ్ కంటే ముందే ఆమె కొన్ని తెలుగు చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది. ఇటీవల ‘డ్రింకర్ సాయి’ చిత్రంతో ఆమె ప్రేక్షకులను అలరించింది. అలాగే హీరో ధర్మ మహేష్‌తో లవ్‌లో ఉన్నట్టు రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. దీనిపై ఎలాంటి సమాచారం లేకపోగా.. ఇప్పుడు డ్యూడ్ సినిమాతో ఈ అమ్మడు అటు తమిళ, తెలుగు భాషాల్లో అభిమానులకు దగ్గరయ్యింది. లేట్ ఎందుకు ఆమె ఫోటోలపై మీరూ ఓసారి లుక్కేయండి మరి.
View this post on Instagram
