SP Balasubrahmanyam: దుబాయ్ షేక్ నోట బాలసుబ్రహ్మణ్యం పాట.. పొల్లుపోకుండా పాడి ఫిదా చేశాడుగా..
తెలుగు సినిమా పాటలుకు ఉన్న ప్రాధాన్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈమధ్య పాటల్లో క్యాచీ పదాలు ఎక్కువై అర్ధం పర్ధం లేకుండా సాగుతున్నాయి..
తెలుగు సినిమా పాటలుకు ఉన్న ప్రాధాన్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈమధ్య పాటల్లో క్యాచీ పదాలు ఎక్కువై అర్ధం పర్ధం లేకుండా సాగుతున్నాయి.. కానీ ఒకప్పటి సినిమాల్లో ఎంతో అందమైన.. అద్భుతమైన సాహిత్యం తొణికిసలాడేది. పాట వింటుంటే తెలియని అనుభూతితో మనసు నిండిపోతుంది. ఇక అలాంటి పాట పాటలు రాయడంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి దిట్ట. ఆయన కలం నుంచి జాలువారే పాటలు ఎంతో మంది శ్రోతలను రంజింపజేశాయి. ఇక సిరివెన్నెల గీతానికి బాలు గానంతోడైతే ఆ అనుభూతుని మాటల్లో వర్ణించలేం. ఆ పాటలు వింటుంటే మనం కూడా తెలియకుండానే సింగర్‌గా మారిపోతుంటాం.. కేవలం తెలుగు వాళ్లనే కాదు ఇతర బాషల సంగీత అభిమానులను కూడా పాటలు కదిలించాయి. తాజాగా ఓ దుబాయ్ షేక్ మన తెలుగు పాటను.. అందులోనూ సిరివెన్నెల గేయరచనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను అందంగా ఆలపించాడు.
సినీరచయితగా సీతారామ శాస్త్రి మొట్టమొదటి సినిమా సిరివెన్నెల. కళాతపస్వి కె విశ్వనాథ్ తెరకెక్కించిన అందమైన ఈ దృశ్య రూపంలో అద్భుతమైన పాటలు రాశారు సీతారామ శాస్త్రి. అందులో విధాత తలపున అనే పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఆ పాట ఓ సంచలనమే. బాలు గళమున ధ్వనించిన ఈ మధురమైన గీతాన్ని దుబాయ్ షేక్ ఆలపించారు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పాటను ఏమాత్రం పొల్లుపోకుండా, లయ తప్పకుండా ఆయన చక్కగా ఆలపించారు. టిక్‌టాక్‌లో ఆయన షేర్ చేసిన ఈ వీడియో ఇతర సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :