మద్యం మత్తులో ’నటి‘ వీరంగం

| Edited By:

Apr 02, 2019 | 3:10 PM

మద్యం మత్తులో ఓ టీవీ నటి హల్‌చల్ చేసింది. ఓవర్ స్పీడుతో ఏడు వాహనాలను ఢీ కొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వివరాల్లోకి వెళ్తే..  ముంబయిలో ఓ టీవీలో పనిచేస్తోన్న రుహి షకిలేశ్వర్ సింగ్ అతిగా మద్యాన్ని సేవించింది. ఆ మత్తులోనే సోమవారం తెల్లవారుజామున కారుతో రోడ్డు మీదకు వచ్చింది. ఆ సమయంలో ఒళ్లు తెలీకుండా కారు నడుపుతూ.. శాంటాక్రజ్‌ పరిధిలో వరుసగా వాహనాలను ఢీ కొట్టుకుంటూ పోయింది. ఈ ఘటనలో […]

మద్యం మత్తులో ’నటి‘ వీరంగం
Follow us on

మద్యం మత్తులో ఓ టీవీ నటి హల్‌చల్ చేసింది. ఓవర్ స్పీడుతో ఏడు వాహనాలను ఢీ కొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

వివరాల్లోకి వెళ్తే..  ముంబయిలో ఓ టీవీలో పనిచేస్తోన్న రుహి షకిలేశ్వర్ సింగ్ అతిగా మద్యాన్ని సేవించింది. ఆ మత్తులోనే సోమవారం తెల్లవారుజామున కారుతో రోడ్డు మీదకు వచ్చింది. ఆ సమయంలో ఒళ్లు తెలీకుండా కారు నడుపుతూ.. శాంటాక్రజ్‌ పరిధిలో వరుసగా వాహనాలను ఢీ కొట్టుకుంటూ పోయింది. ఈ ఘటనలో ఏడు వాహనాలు దెబ్బతినగా.. అందులో నాలుగు బైక్‌లు, మూడు కార్లు ఉన్నాయి. అంతేకాదు అడ్డుకున్న వారితో ఆమె వాగ్వాదానికి దిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని గురించి మాట్లాడిన ఓ పోలీస్ అధికారి.. ఆమెపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.