Drugs Case : అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ నటి.. ముంబైలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎన్.సీ.బీ అధికారులు..
సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే పలువురు అరెస్ట్ కూడా అయ్యారు. తాజాగా టాలీవుడ్ నటి డ్రగ్స్ తో అడ్డంగా దొరికింది. ముంబై లోని ఓ హోటల్ పైన ఎన్సీబీ..
Drugs Case : సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే పలువురు అరెస్ట్ కూడా అయ్యారు. తాజాగా టాలీవుడ్ నటి డ్రగ్స్ తో అడ్డంగా దొరికింది. ముంబై లోని ఓ హోటల్ పైన ఎన్సీబీ అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలో నటితో పాటు డ్రగ్స్ విక్రేత చాంద్ మహమ్మద్ ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సరఫరా చేసే సయ్యద్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. 400 గ్రాముల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ దాదాపు 10 లక్షలవరకు ఉంటుందని తెలుస్తుంది. గతంలోనూ డ్రగ్స్ విక్రేత చాంద్ మహమ్మద్ పైన పలు కేసులు ఉన్నాయని తెలుస్తుంది. ఇక అదుపులోకి తీసుకున్న నటిని, డ్రగ్స్ విక్రేత చాంద్ మహమ్మద్ అధికారులు విచారిస్తున్నారు. మరి కొంత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. తాజాగా నటి పట్టుబడటం టాలీవుడ్ ఒక్క సరిగా ఉలిక్కి పడింది.